21 ఏళ్ళ క్రితం వచ్చిన లగాన్ సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ సినిమాను గుర్తుచేశారు ఆదిలాబాద్ అన్నదాతలు. సంక్రాంతి సందర్భంగా పంచెకట్టులో క్రికెట్ ఆడారు అన్నదాతలు. దీంతో ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది స్టేడియం.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన రైతులు క్రికెట్ ఆడారు. బోథ్ లోని లాల్ పిచ్ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో మండల కేంద్రానికి చెందిన రైతులంతా కలిసి జట్టుగా ఏర్పడి పోటీల్లో పాల్గొన్నారు. హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఆడిన ఆట అందరినీ ఆకట్టుకుంది. రైతులని చులకనగా చూడకుండా..మేంకూడా క్రికెట్ ఆడిచూపించగలమని కలిసికట్టుగా ముందుకొచ్చారు.