Summer Heat: భానుడి భగభగలు..బాబోయ్ అంటున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్నమొన్నటివరకూ చలికాలం చంపేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పులి పంజా విసిరింది. చలికాలం విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ సూరీడు మండిపోతున్నాడు. సెగలు కక్కుతూ.. విరుచుకుపడుతున్నాడు. శివరాత్రి ముగిసిన వెంటనే చలి తగ్గుతుంది కానీ మరీ ఇంత వేడి వుండడం అరుదు అంటున్నారు జనం. వేసవికాలం వచ్చేసిందనడానికి దండి కొడుతున్న ఎండలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా నమోదవుతూ.. జనాలను హడలెత్తిస్తున్నాయి.
తెలంగాణలో గురువారం అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ణంగా పెద్దపల్లి జిల్లాలోని శ్రీరాంపూర్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, జగిత్యాల, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
- AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 42.8 డిగ్రీలు నమోదు. ఆదిలాబాద్ అర్బన్ లో 42.2 డిగ్రీలు, కొమురం భీం జిల్లా కౌటాలలో 42.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో 42.6డిగ్రీలు, నర్సాపూర్ (జీ)లో 42.5 గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోనూ.. ఎండాకాలం మంటలు ప్రారంభం అయ్యాయి. అనేక చోట్ల ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 39 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరాయి. రాత్రి 8 గంటలైనా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నామంటున్నారు జనం. ఎండలోకి వెళ్ళేముందు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్ కాకుండా మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

తాజావార్తలు
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్‌కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!