ఆయుధాల అక్రమ రవాణా వ్యవహారంలో పంజాబ్ పోలీసులకు చిక్కిన ఉగ్ర అనుమానితులను తెలంగాణకు తీసుకురానున్నారు. పంజాబ్‌లోని కర్నాల్‌లో అక్కడి పోలీసులు ఈ నెల 5న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారికి పాకిస్థాన్‌లో ఉంటూ ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది రింధాతో సంబంధమున్నట్లు విచారణలో తేలింది. వారిలో భూపేంద్రసింగ్, పర్మేందర్‌సింగ్‌లను విచారణ అనంతరం తిరిగి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు అమన్‌దీప్ సింగ్, గురుప్రీత్ సింగ్‌లను న్యాయస్థానం అనుమతితో ఆదిలాబాద్‌కు…
సిమెంట్ పరిశ్రమను అమ్మేస్తే..బీజేపీ నేతలను తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న. సిమెంట్ పరిశ్రమ అమ్మెస్తే బీజేపీ నేతలను జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరికలు జారీ చేశారు. సీసీఐని అమ్మేస్తామంటే తాము చూస్తూ ఊరుకోమని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపి సోయం బాపురావ్ రాజీనామా చేయి..లేదంటే సీసీఐ పై మీవైఖరి ఏంటో చెప్పు అంటూ నిలదీశారు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న. సీసీఐని వేలం వేస్తే జిల్లా ప్రజలు బీజేపీని వేలం…
ప్రయాణికుల అవసరం.. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల అవకాశం.. వెరశి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొమురం భీం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు యాజమాన్యం మోసం బయటపడింది. పరిమితికి మించి ప్రయాణికులను బస్సు లో ఎక్కించడం తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వాంకిడి చెక్ పోస్ట్ వద్ద బస్సును రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి యూపీ, బీహార్ వెళ్లేందుకు ఒక ప్రైవేటుట్రావెల్స్ ద్వారా వెళుతున్న ప్రయాణికులు టికెట్ ధర…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అధికార టిఆర్ఎస్ నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఖానాపూర్ సోషల్ మీడియా గ్రూప్‌లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తన రోజు వారి కార్యక్రమాలు, టూర్ షెడ్యూల్, హజరైన కార్యక్రమాల ఫోటోలు పెడుతున్నారు. అదే గ్రూప్‌లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కార్యక్రమాలు సైతం పోస్ట్ చేస్తున్నారు. అయితే రాథోడ్ జనార్దన్ వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారని ప్రచారం ఉండటంతో వర్గపోరుకు తెరతీసింది. దాంతో…
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు ఇళ్ల నుంచి కాలు బయటపెట్టే అవకాశం ఉండటం లేదు. అంతలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటితే కానీ ఎండలు తగ్గడం లేదు. రికార్డ్ స్థాయిలో 45 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ నమోదు అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం ఆకాశం మేఘాలతో ఉండీ విభిన్న వాతావరణం కనిపిస్తోంది. కాగా..ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మండే ఎండలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. భానుడి…
మిషన్ భగీరథ నీళ్లు చౌర్యానికి గురౌతున్నాయి..ప్రధాన పైప్ లైన్ కు తూట్లు పొడిచి నీటిని ఇల్లీగల్ పంపింగ్ చేసుకుంటున్నారు..ఒక జిల్లాకు రావాల్సిన నీళ్లను ఇంకో జిల్లా అధికారులు దొంగిలిస్తారా? ఎవరో చెబితే ఏకంగా మెయిన్ పైప్ లైన్ కే కనెక్షన్లు ఇవ్వొచ్చా? మంత్రి స్వంత గ్రామం నీళ్ల కోసం మిగతా జిల్లా జనం గోసపడాల్సిందేనా? ఇంతకీ నీటి గొడవేంటి? అధికారులే రూల్స్ బ్రేక్ చేశారా? ఎవరైనా అలా చేయించారా? ఉన్నతాధికారుల వద్దకెళ్ళిన ఆదిలాబాద్ జిల్లా నీటి పంచాయితీ…
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై బీజేపీ నిలదీస్తోంది. తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ మూర్ఖుడు, ఆదివాసీ, గిరిజన వ్యతిరేఖి అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గిరిజనులకు 9.8 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కులాన్ని,…
టెర్రరిస్టులు ఆదిలాబాద్ ను సేఫ్ జోన్ గా భావిస్తున్నారా? పోలీసులను పక్కదారి పట్టించేందుకే ఆదిలాబాద్ పేరెత్తుకున్నారా? ఇంతకీ ఆదిలాబాద్ లొకేషన్ ఎందుకు చెప్పారనే దానిపై నిఘా వర్గాల ఆరా ముమ్మరం అయింది. వాస్తవంగా ఖలిస్తాన్ కు ఇక్కడ నెట్ వర్క్ ఉందా? ఉంటే ఎవ్వరు…స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయా? ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందే పసిగట్టలేదా? ఇంతకీ హర్యానాలో పట్టుబడ్డ ఉగ్ర ముఠా ప్లానేంటి? కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తు ఎక్కడికొచ్చింది..రాష్ట్ర పోలీస్ విభాగం…
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నేతల ల్యాండ్ పంచాయితీలు శ్రుతి మించుతున్నాయి. గుడిహత్నూర్.. ఇచ్చోడ మధ్య ఉన్న భూమి విషయంలో కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఆ ల్యాండ్ పంచాయితీ బీజేపీ ఎంపీ సోయం బాపూరావ్ ఇంటికి చేరడంతో.. సమస్యపై మాట్లాడేందుకు కొందరు పార్టీ నేతలు కూడా అక్కడికి వెళ్లారు. ఒకానొక సమయంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరగడంతో సమస్య మరో మలుపు తీసుకుంది. జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్‌రెడ్డి ఎంపీ ఇంట్లోకి దూసుకెళ్లారని ఎంపీ గన్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం..…
వేసవికాలం మండుతోంది. సూరీడు ఉదయం నుంచి ప్రచండంగా మారుతున్నాడు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత పెరుగుతూనే వుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి..మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు..ఒకవైపు 45 డిగ్రీలు దాటిన ఎండలు మరో వైపు ఉక్కపోత,వడగాలులతో ఉక్కిబిక్కిరౌతున్నారు..రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ లో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రెండు మూడు రోజులుగా జైనాథ్ ,బేలామండలాల్లో 45 డిగ్రీలుదాటి నమోదు అవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలతో…