ఆయుధాల అక్రమ రవాణా వ్యవహారంలో పంజాబ్ పోలీసులకు చిక్కిన ఉగ్ర అనుమానితులను తెలంగాణకు తీసుకురానున్నారు. పంజాబ్‌లోని కర్నాల్‌లో అక్కడి పోలీసులు ఈ నెల 5న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
వారికి పాకిస్థాన్‌లో ఉంటూ ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది రింధాతో సంబంధమున్నట్లు విచారణలో తేలింది. వారిలో భూపేంద్రసింగ్, పర్మేందర్‌సింగ్‌లను విచారణ అనంతరం తిరిగి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు అమన్‌దీప్ సింగ్, గురుప్రీత్ సింగ్‌లను న్యాయస్థానం అనుమతితో ఆదిలాబాద్‌కు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పంజాబ్ నుంచి ఆయుధ సామగ్రిని ఆదిలాబాద్‌కు తరలించే క్రమంలోనే వీరు చిక్కిన నేపథ్యంలో.. ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకొంది. వారిని ఆదిలాబాద్ తీసుకొచ్చి ఎక్కడ ఆయుధాలను అప్పగించాలనుకున్నారన్న విషయంపై ఆరా తీయనున్నారు. వాస్తవానికి ఆయుధాలను ఆదిలాబాద్‌లో ఎవరికి అప్పగించాలనే విషయం నలుగురు నిందితులకు సైతం తెలియదని పోలీసులు భావిస్తున్నారు.
పాకిస్థాన్ నుంచి రింధా కేవలం ఆదిలాబాద్ లొకేషన్‌ను మాత్రమే వాట్సప్ ద్వారా షేర్ చేశాడని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే ఆధారాలేమైనా దొరుకుతాయా అనే ఉద్దేశంతో అక్కడికి నిందితులిద్దరినీ తీసుకురానున్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో సేకరించిన సమాచారం మేరకు గత 6 నెలలుగా కర్నాల్ నిందితులకు సుమారు రూ.22 లక్షల హవాలా సొమ్ము అందినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
కర్నాల్ లో అరెస్టైన నిందితులు ఆదిలాబాద్ నుండి ఆయుధాలు తరలించాలని ప్లాన్ చేసినట్టుగా విచారణలో ఒప్పుకోవడంతో Telangana పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు.ఈ నెల 6 వ తేదీన తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు ఈ విషయమై ఆరా తీశారు.
అయితే.. 2022 May 6న పంజాబ్ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చేరవేసేందుకు పేలుడు పదార్ధాలతో వెళ్తున్న కారును హరియాణా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా దీంతో.. దేశంలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. నలుగురు నిందితులు.. పంజాబ్‌కు చెందినవారేనని తెలుస్తోంది. నిందితుల పేర్లు గుర్ప్రీత్, అమన్‌దీప్, పర్మిందర్, భూపేందర్ అని సమాచారం. వీరికి పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా వీరి నుంచి మూడు ఐఈడీలు, 31 బుల్లెట్లు, పిస్టోల్, ఆరు ఫోన్లు, రూ. 1.3లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను ప్రశ్నించేందుకు మహారాష్ట్రలోని నాందేడ్ పోలీసుల బృందం.. హరియాణాకు వెళ్లింది. హరియాణా నుంచి నిందితులు నాందేడ్‌కు సమీప ప్రాంతానికి వెళ్లాలని భావించినట్టు ఓ పోలీసు అధికారి చెప్పడం ఇందుకు కారణం.
“కర్నల్‌కు మా పోలీసు బృందాన్ని పంపించామని, నలుగురు నిందితులను ఆ బృందం విచారిస్తుందని, ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాము,” అని నాందేడ్ ఎస్పీ ప్రమోద్‌కుమార్ స్పష్టం చేశారు.
Salaar: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్