వరల్డ్ వాటర్‌ఫాల్ రాప్లింగ్ మూడో విడత పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చో్డ మండలంలోని గుండివాగు వద్ద 330 అడుగుల ఎత్తున్న గాయత్రి జలపాతంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలలో 30కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 33 టీవీ ఛానెల్స్ ఈ పోటీలను టెలికాస్ట్ చేస్తాయని చెప్పారు. ఉవ్వెత్తున దూకే జలపాత ధారల్లో తాడు సాయంతో పై నుంచి (స్ట్రెయిట్ పాయింట్) కిందకు (ఫినిష్ పాయింట్)కు చేరడాన్నే…
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో నిన్న శుక్రవారం మథ్యాహ్నభోజనం వికటించి 300 మంది విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సుమారు 1200 మంది విద్యార్థులు వాంతులు చేసుకోగా.. ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వాంతులు, అస్వస్థతకు గురైన వారికి అక్కడే గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందించారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. విషయం బయటకు రావడంతో విద్యార్తుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. read also: Nupur Sharma: ఫోటో…
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు వీటి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా భారీ నుంచి అతిభారీ…
తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు పూర్తిగా రాష్ట్రంలో విస్తరించడంతో అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ ప్రాంతలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 4న రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మంచిర్యాల, జగిత్యాల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు…
టీడీపీని స్థాపించిన అనతి కాలంలోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి తెచ్చి చరిత్ర సృస్టించారు.. ఎన్టీఆర్ అసలైన హీరో, ఆయన దేవుడంటూ వ్యాఖ్యానించారు బీజేపీ నేత బిప్లవ్‌దేవ్.
వేసవి తాపంతో అల్లాడుతున్న భాగ్యనగరవాసులకు వర్షం చల్లబరిచింది. అయితే సోమవారం రాత్రి నుంచి వర్షం దంచికొట్టడంతో హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షం నీటితో నాళాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, నైరుతి రుతుపవనాలు కూడా చురుకుగా ఉండడంతో ఈ…
పోడు భూముల లొల్లిఎటూ తెగడం లేదు. భూమే తమకు ఆధారం అని ఆదివాసీలంటుంటే అసలు అక్కడ పోడు భూమే లేదంటున్నారు అటవీశాఖ అధికారులు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా తిరిగొచ్చాక సైతం ఆదివాసీలు భూమి కోసం ఆరాటపడుతుంటే అధికారులు అది కవ్వాల్ టైగర్ జోన్ అంటూ ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఎంత చేసినా ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇవ్వబోమని అటవీశాఖ తేల్చి చెబితే.. .తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని వదల బోమంటున్నారు ఆదివాసీలు..మంచిర్యాల జిల్లా కోయపోష గూడెంలో…
మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి. ఇద్దరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు. వేర్వేరు వర్గాలు. తూర్పు.. పడమర ప్రాంతాలకు చెందిన నాయకులు. మహేశ్వర్రెడ్డి ప్రస్తుతం AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్గా ఉన్నారు. ఇన్నాళ్లూ అంతర్గత కలహాలతో ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇద్దరూ.. ప్రస్తుతం యుగళగీతం ఆలపించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అధిష్ఠానం ఒత్తిడో ఏమో ఇద్దరూ ఒకే లైన్లోకి వచ్చారు. ఇలాంటి సమయంలో ప్రేమ్ సాగర్రావు చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.…