మిషన్ భగీరథ నీళ్లు చౌర్యానికి గురౌతున్నాయి..ప్రధాన పైప్ లైన్ కు తూట్లు పొడిచి నీటిని ఇల్లీగల్ పంపింగ్ చేసుకుంటున్నారు..ఒక జిల్లాకు రావాల్సిన నీళ్లను ఇంకో జిల్లా అధికారులు దొంగిలిస్తారా? ఎవరో చెబితే ఏకంగా మెయిన్ పైప్ లైన్ కే కనెక్షన్లు ఇవ్వొచ్చా? మంత్రి స్వంత గ్రామం నీళ్ల కోసం మిగతా జిల్లా జనం గోసపడాల్సిందేనా? ఇంతకీ నీటి గొడవేంటి? అధికారులే రూల్స్ బ్రేక్ చేశారా? ఎవరైనా అలా చేయించారా? ఉన్నతాధికారుల వద్దకెళ్ళిన ఆదిలాబాద్ జిల్లా నీటి పంచాయితీ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.
ఆదిలాబాద్ ,నిర్మల్ జిల్లాల్లో మిషన్ భగీరథ అధికారుల మధ్య వార్ మొదలైంది.. ఇల్లీగల్ గా ప్రధాన పైప్ లైన్ కు నిర్మల్ జిల్లాకు చెందిన అధికారులు ఆరు చోట్ల టాంపరింగ్ చేసి పైప్ లైన్లు బిగించారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు కావాల్సినంత నీరు రాక కాలనీల్లో నీటి ఎద్దడి ఎదురౌతోంది..ఈమధ్య ఇల్లీగల్ కనెక్షన్ యవ్వారం క్షేత్ర స్థాయి విజిట్ కు వెళ్ళిన గ్రిడ్ అధికారుల కంటపడింది.
ఆదిలాబాద్ కు వెళ్ళే మిషన్ భగీరథ పైప్ లైన్ కు అక్రమంగా కనెక్షన్ ఇచ్చారంటూ ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశంలో ఇటీవల అధికారులను నిలదీసారు కౌన్సిలర్లు. నిర్మల్ జిల్లాలో మొత్తం ఆరు చోట్ల ప్రధాన పైప్ లైన్ కు కనెక్షన్లు ఇవ్వడం కలకలం రేపుతోంది. దాంతో నీటి ఎద్దడి ఏర్పడుతుందని పైగా కొండలు గుట్టల మీదనుండి రావాల్సిన నీరు సరియైన ప్రెషర్ లేకపోవడం వల్ల రావాల్సినంత నీరు రాకుండా పోతుంది. దీంతో కౌన్సిలర్లు మిషన్ భగీరథ అధికారులను ప్రశ్నించారు ఇప్పటికే కేఆర్ కే కాలనీతోపాటు ఆదిలాబాద్ మున్సిపల్ పరిదిలోని వివిధ కాలనీల్లో నీటి సమస్య తీవ్రతరం అయింది. దీంతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాలు సైతం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాలతోనే ఆయన స్వంత గ్రామం ఎల్లపల్లి, అలాగే దిల్వార్ పూర్ ఎక్స్ రోడ్, సింగ్ ఈజీ కింగ్ దాబా,మంచిర్యాల ఎక్స్ రోడ్ తోపాటు ఆరేపల్లి రోడ్ ,బైంసా రోడ్లో రెండు చోట్ల ఇలా ఆదిలాబాద్ కు నీటిని తీసుకొచ్చే పైప్ లైన్ కు అక్రమంగా కనెక్షన్లు ఇచ్చారని కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు. పైగా అలా కనెక్షన్లు ఇవ్వడం నేరం అంటున్నారు ఆదిలాబాద్ కౌన్సిలర్లు. మంత్రి చెప్పారో లేదో కాని అలా ప్రధాన పైప్ లైన్ కు రంధ్రాలు చేస్తే మాపరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు.
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ సైతం దీనిపై స్పందించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళామంటున్నారు. అలాగే ఎమ్మెల్యే జోగురామన్న దృష్టికి తీసుకెళ్ళామని సమస్య లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. అధికారుల రూల్స్ ప్రకారం ప్రధాన పైప్ లైన్ కు ఎలాంటి కనెక్షన్లు ఇవ్వకూడదు..అలాంటిది ఆరు చోట్ల కొత్తగా పైప్ లైన్లు బిగించడం ఎవరి ఒత్తడితో అలా చేశారు…వెనకబడ్డ ఆదిలాబాద్ ప్రజలను కనీసం తాగునీరు సైతం రాకుండా చేస్తారా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. మంత్రి సొంత జిల్లాలో అక్రమంగా కనెక్షన్లు ఇవ్వడంపై మంత్రిపైనే విమర్శలు వస్తున్నాయి. మరీ అక్రమంగా బిగించిన కనెక్షన్లు అన్నీ తొలగించి ఆదిలాబాద్ జనం గొంతెండకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
Hyderabad : బంజారాహిల్స్‌లో దారుణం.. బీరు బాటిల్ తో కడుపులో పొడిచి హత్య