సిమెంట్ పరిశ్రమను అమ్మేస్తే..బీజేపీ నేతలను తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న. సిమెంట్ పరిశ్రమ అమ్మెస్తే బీజేపీ నేతలను జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరికలు జారీ చేశారు. సీసీఐని అమ్మేస్తామంటే తాము చూస్తూ ఊరుకోమని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపి సోయం బాపురావ్ రాజీనామా చేయి..లేదంటే సీసీఐ పై మీవైఖరి ఏంటో చెప్పు అంటూ నిలదీశారు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న.
సీసీఐని వేలం వేస్తే జిల్లా ప్రజలు బీజేపీని వేలం వేస్తారంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే జోగు రామన్న. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ ఘెరావ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సిమెంట్ పరిశ్రమ కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇన్నాళ్ల పాటు సీసీఐ ని తెరిపిస్తామన్న బీజేపీ నేతలంతా ఎక్కడికెల్లారని నిలదీశారు ఎమ్మెల్యే జోగురామన్న. బీజేపీ పార్టీ నాయకులు.. అన్ని అమ్ముకుంటూ వెళుతున్నారని.. వారికి తగిన బుద్ది చెప్పాలని కోరారు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న.
ఇటీవలే.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు 500 మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.. వీరికి పార్టీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్ లోకి ఎఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఆహ్వానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.
రైతులకు రైతుభీమా, రైతుబంధు, 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నదని, ఈ పథకాలనే కేంద్రం కాపీకొట్టి వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తోందని స్పష్టం చేశారు. జాతీయ పార్టీలకు తెలంగాణ దిక్సూచిగా మారిందని వివరించారు.
Hardik Patel resigns: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి హార్దిక్ పటేల్ గుడ్‌బై