నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో నిన్న శుక్రవారం మథ్యాహ్నభోజనం వికటించి 300 మంది విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సుమారు 1200 మంది విద్యార్థులు వాంతులు చేసుకోగా.. ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వాంతులు, అస్వస్థతకు గురైన వారికి అక్కడే గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందించారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. విషయం బయటకు రావడంతో విద్యార్తుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
read also: Nupur Sharma: ఫోటో అప్ లోడ్ చేసినందుకు చంపేస్తామని వార్నింగ్
ఈనేపథ్యంలో త్రిబుల్ ఐటీ లోపల బయట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరిని అనుమతించలేదు. విద్యార్థుల విషయం తెలిసుకున్న డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ ను లోపలికి పోలీసులు అనుమతించలేదు. ఈనేపథ్యంలో రామారావు త్రిబుల్ ఐటీ గేటు ముందు నిలుచునే విద్యార్థులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈనేపథ్యంలో.. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలియగానే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పదించారు. జిల్లా కలెక్టర్, బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్రిబుల్ ఐటీ విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వెంటనే నివేదిక అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?