Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని 872 గ్రామాలకు మూడు రోజులుగా నీటి సరఫరా బంద్ చేశారు అధికారులు.
Karimnagar: ఆగస్టు 15 సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అనుమానితుల ఇళ్లపై సోదాలు చేపట్టారు.
సెల్ఫీ సరదా పీజీ వైద్యవిద్యార్ధి ప్రాణాలు తీసింది. ఆదివారం శివ్‌ఘాట్ సందర్శనకు వెళ్లి సాత్నాల వాగులో గల్లంతైన ఆదిలాబాద్ రిమ్స్‌లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్థోపెడిక్ వైద్యుడు భుక్యా ప్రవీణ్ మృతదేహం లభించింది.
Adilabad: తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వరదల బారిన పడ్డాయి. దీంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ జ్వరాలు ఇప్పటికే అంటువ్యాధి అయితే, తాజా కండ్లకలక గందరగోళాన్ని కలిగిస్తుంది.
తెలంగాణలో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కుండపోత వర్షాలు పడటంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రాష్ట్రంలోని పలు చోట్ల రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో NH44పై నిన్నటి (శనివారం) నుంచి వెహికిల్ రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.
తాను ఎంపీ లాడ్స్ నిధులతో ఇల్లు కట్టాను, పెళ్లి చేశాను అనేది అవాస్తవమన్నారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను అలా అనలేదని.. రమేష్ రాథోడ్, జిల్లా అధ్యక్షుడు శంకర్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నిధులు క్యాడర్ కు ఇస్తే పార్టీకి క్యాడర్ కు తనకు పేరు వచ్చింది కనుక ఆ నేతలు ఇలా కుట్రలు చేస్తున్నారని తెలిపారు.
ప్రతి ఆడపిల్ల లవ్ జిహాద్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని రాజాసింగ్ అన్నారు. లవ్ జిహాద్ పేరుతో కేరళ రాష్ట్రంలో 32000 మంది హిందూ ఆడపిల్లను ఇస్లామిక్ దేశాలకు పంపించి వల్లే జీవితాలను నాశనం చేయడం జరిగింది.
వైఎస్ షర్మిల ఎంపీ సోయం బాపురావుతో మాట్లాడారు. ఇక్కడే ఆమె పొరపాటుపడింది. ఆదివాసీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ ఎంపీగా మీరు సీఎం కేసీఆర్ తో మాట్లాడి పోడు భూములకు పట్టాలు ఇప్పించండి అని షర్మిల సోయం బాపురావును కోరింది. ఆమె మాటలు విన్న ఎంపీ షాక్ అయ్యాడు. తాను గెలిచింది బీజేపీ నుంచి అయితే ఈమె ఏందీ బీఆర్ఎస్ ఎంపీని అంటోంది అని ఆలోచించి వెంటనే సోయం బాపురావు…
ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఇవాల నిర్వహించేందుకు ఆదివాసీ గిరిజనులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమైక్య పాలకుల నిరంకుశ పాలనలో నివాళులు అర్పించేందుకు కూడా వీలులేని ఈ ప్రాంత ప్రజలు నేడు స్వచ్ఛందంగా అమర వీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఉట్నూర్ మండలం పులిమడుగులో ఒక్కరు, కొమరంభీం జిల్లా కాగజ్నగర్ లో ఇబ్రాహీం అనే పండ్ల వ్యాపారి వడదెబ్బతో మృతి చెందడం కలకలం రేపింది.