తెలంగాణలోని ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. రెండో రోజు రిమ్స్ మెడికల్ కాలేజీ ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగుతుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మావోల పేరుతో లేఖలు కనిపించాయి. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిల పేర్లు ప్రస్తావిస్తూ లేఖలు వైరల్ అవుతున్నాయి.
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. నేడు నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొననున్నారు.
తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు గులాబీ అధినేత నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తునే.. తాము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని.. అస్తులు అమ్ముకుని ప్రజలకు సేవ చేశామని మాజీ కాంగ్రెస్ నేత సుజాత తెలిపారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పథకాలు బీజేపీ- కాంగ్రెస్ నాయకులు కూడా పొందుతున్నారు.. కేసీఆర్ కు ఓటేయకుంటే నష్టం పోతాం.. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవు.. రైతు సంక్షేమానికి పాటుపడ్డ ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్.. రైతాంగానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాలి అంటూ జోగు రామన్న డిమాండ్ చేశారు.
పార్టీ మారుతారు అనే ప్రచారంపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. నేను పార్టీ మారడం లేదు.. జరుగుతున్నది ప్రచారం మాత్రమే అందులో వాస్తవం లేదు.. ఏఐసీసీలో నాపై చర్చ జరిగినట్టుగా సమాచారం ఉంది.. కాంగ్రెస్ పార్టీ నేతలను నేను కలవ లేదు అని ఆయన తెలిపారు.
అంగన్వాడీల ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గత 12 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ కాకపోవడంతో అటు పోలీసులు ఇటు అంగన్వాడీల మధ్య వివాదం చెలరేగింది.
Polala Amavasya celebrations in Adilabad: శ్రావణ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకమే. ఈ మాసంలో భక్తులు నిష్టతో భక్తి శ్రద్దలతో ఒక్కపొద్దును పాటిస్తారు. అయితే ఈ శ్రావణ మాసం ప్రకృతితో మమేకమైన జిల్లా ఆదిలాబాద్లో వేడుకలు ఘనంగా జరిగాయి.