తెలంగాణలో అప్పులన్నీ తీరి అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ ఎదిగిందని ఆయన తెలిపారు. శనివారం రాత్రి ఆదిలాబాద్‌లో జరిగిన చేరికల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
Fake Seeds: సీజన్ ప్రారంభ కాకముందే ఫేక్ సీడ్స్ ముఠాలు రంగంలోకి దిగాయి..అమాయక రైతులను ముంచేందుకు రెడి అయ్యారు. నాణ్యతలేని విత్తనాలను అంటగట్టే ముఠాలు మళ్లీ తమ పనికానిచ్చేస్తున్నారు.
Love Marriage: ప్రేమ ఎప్పుడు, ఎవరిపై, ఎలా పుడుతుందో చెప్పలేం అంటారు.. ఇలా ఇప్పటికే రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి.. అసలు ఎల్లలు లేకుండా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి.. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లి, ఉద్యోగాలు చేస్తూ.. ప్రేమలో పడి ఆ తర్వాత ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు నడిపించిన ప్రేమికులు ఎంతో మంది ఉన్నారు.. తాజాగా, ఆదిలాబాద్ అబ్బాయి.. మయన్మార్ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు.. ఈ పెళ్లితో ప్రేమకు ఎల్లలు…
నాగోబా జాతరకు తరలివస్తున్న భక్తజనంతో కేస్లాపూర్ పోటెత్తుతోంది. దీంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. రెండో రోజు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెస్రం వంశీయులు గోవాడ నుంచి ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదీవాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే నాగోబా జాతరకు వేళయింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది.
అడవి బిడ్డల అద్భుత జాతర నాగోబా జాతర నేటి నుంచి ఘనంగా ప్రారంభంకానుంది. గంగాజలాభిషేకంతో ప్రారంభమయ్యే నాగోబా జాతర పుష్య మాసం అమావాస్య అర్ధరాత్రి లోకమంతా నలుపు రంగు పులుముకుంటే.. ఆదిలాబాద్లోని కేస్లాపూర్లో వెలుగుల వెలుగుల మధ్య జాతర ప్రారంభమవుతుంది.