PM Modi Speech in Adilabad: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం సహకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టిందని.. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనం అని అన్నారు. ఆదిలాబాద్‌లో రూ.7వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి…
Minister Seethakka Visits Utnoor Ashram School: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివారం రాత్రి ఆశ్రమ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అంతేకాదు ప్రతి గదికి వెళ్లి అక్కడి సదుపాయాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి.. అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ, తదితరులు పాల్గొన్నారు.…
PM Modi Adilabad Schedule Today: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో ఎక్కువగా విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పర్యటన సందర్భంగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. తెలంగాణని 17 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని…
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా క్షేత్రంలో అంగకంగ వైభవంగా జాతర ప్రారంభమైంది. నాగ శేషుడుని పూజించే ఈ నాగోబా జాతర గంగాజలాభిషేకంతో శ్రీకారం చుట్టారు.
Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఐదు రోజుల పాటు జరిగే గిరిజన జాతర 'నాగోబా'. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి నాగదేవతకు పవిత్ర గోదావరి నది అభిషేకంతో జాతర ప్రారంభమవుతుంది.
CM Revanth Reddy:ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపద్యం లో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నారు.
ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది.
సీఎంకి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉంది అని మంత్రి సీతక్క తెలిపారు. అభివృద్ధికి ముందడుగు ఇక్కడి నుంచే బాటలు పడుతాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనక బడి ఉంది.. రేవంత్ రెడ్డి మొదటి సభ భట్టి విక్రమార్క పాదయాత్ర ఈ జిల్లా నుంచే ప్రారంభించారు.
నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జంగు బాయి జాతర నేపథ్యంలో కెరమెరి మండలం గొండి గ్రామ పరిధిలో గల జంగు బాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క సందర్శించారు.