Tragedy: ఆ నలుగురు సినిమా సీన్ రిపీట్.. మృతదేహం ముందే ఆస్తిపంపకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: డబ్బు.. డబ్బు డబ్బే ప్రపంచం.. అది లేకపోతే మానవ సంబంధాలకు విలువేలేదు. జానెడు పొట్ట నిండాలంటే చేతిలో పైసా ఉండాల్సిందే. హాలో అంటే.. బోలో అని పలకాలన్నా డబ్బే కావాలి. అలాంటి డబ్బు కుటుంబాలను నిలబెడుతుంది.. పడగొడుతుంది. సమాజంలో గౌరవంగా బతకాలంటే ప్రతి ఒక్కరికీ డబ్బే కావాలి. అలాంటి గౌరవాన్ని అందించేందుకు కుటుంబ పెద్ద నానాకష్టాలు పడతాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎంత ఖర్చైనా ఆదుకుంటాడు. అలాంటి పెద్దాయన చనిపోతే ఓ కుటుంబం ఇన్నాళ్లు కంటి రెప్పలా చూసుకున్న పెద్దాయనను వదిలి… శవం అక్కడ ఉండగానే ఆస్తి పంపకాలకు సిద్ధం అయింది. అచ్చం ఆ నలుగురు మూవీ సీన్ రిపీట్ అయింది. సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని సిరికొండ గ్రామంలో బుధవారం ఇది వెలుగుచూసింది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని రెండ్రోజులుగా ఇంటి ముందే ఉంచి దాయాదులు ఆస్తుల పంపకంపై దృష్టిపెట్టారు. ఆస్తుల పంపకాలు అయిపోయి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే దహన సంస్కారాలు చేయాలంటూ భీష్మించుకున్నారు.
అసలేం జరిగింది.?
Also Read
సిరికొండకు చెందిన వెంపటి సత్యనారాయణ(63) మంగళవారం అనారోగ్యంతో మృతిచెందారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఈయన తన సోదరుల వద్ద ఉంటున్నారు. మృతుడి భార్య భాగ్యమ్మ తన సోదరుల వద్ద ఉంటుంది. వీరికి సంతానం లేదు. ఇటీవల సత్యనారాయణ క్యాన్సర్ బారినపడి ఆరోగ్యం క్షీణించడంతో వైద్య చికిత్స కోసం ఈయన సోదరులు రూ.లక్షల్లో అప్పులు చేసినట్లు చెబుతున్నారు. భాగ్యమ్మకు గ్రామంలో తల్లిగారిచ్చిన సుమారు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఈమె పేరిటే ఉంది. భార్యభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భాగ్యమ్మ పేరిట ఉన్న భూమిలో ఎకరం భూమిని సత్యనారాయణ పేర రిజిస్ట్రేషన్ చేసేందుకు ఇటీవల పెద్దలు నిర్ణయించి సోమవారం ధరణిలో స్లాట్ బుక్ చేశారు.
మరుసటి రోజు (మంగళవారం) ఉదయం రిజిస్ట్రేషన్‌కు సత్యనారాయణ రావలసి ఉంది. ఇంతలోనే… మంగళవారం ఉదయం అతడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో రంగప్రవేశం చేసిన సత్యనారాయణ సోదరులు తాము అన్న వైద్య ఖర్చులకు సుమారు రూ.30 లక్షలదాకా ఖర్చు చేశామని, వదిన పేరు మీద ఉన్న భూమిలో ఎకరన్నర భూమి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని పట్టుబట్టారు. ధరణిలో స్లాట్ బుక్ చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసేదాకా దహన సంస్కారాలు చేసేది లేదంటూ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకున్నారు. పనిలో పనిగా భాగ్యమ్మను తాము ఇన్నాళ్లు పోషించామని, మా పేర భూమి పట్టా చేయాలంటూ భాగ్యమ్మ వదిన, మరదళ్లు, వారి పిల్లలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తహసీల్ కార్యాలయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
పోలీస్టేషన్ లో ఫిర్యాదు..
దీంతో భాగ్యమ్మ తాను ఇన్నాళ్లుగా తలదాచుకున్న వారి బంధువుల పిల్లలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం స్లాట్ బుక్ చేసుకున్న ఆయన సోదరులు వారిలో ఒకరి పేరిట భాగ్యమ్మ పేర ఉన్న భూమిలో ఎకరన్నర పట్టా చేయించుకున్నారు. భాగ్యమ్మ వదిన, మరదలు చెరో అరెకరం భూమి పట్టా చేయించుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. బుధవారం సాయంత్రం గ్రామానికి వెళ్లి సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం బంధువులంతా కలిసి మృతదేహాన్ని ఇంటి ముందు వదిలి వెళ్లడంతో కుమారుడి శవానికి వృద్ధురాలైన తల్లి ఒంటరిగా కాపలా కాయడం పలువురిని కలచివేసింది.
Chandrababu: అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?