Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని 872 గ్రామాలకు మూడు రోజులుగా నీటి సరఫరా బంద్ చేశారు అధికారులు. నిర్మల్ జిల్లా దిల్వార్ పూర్ మండలం మాడేగాం ఫిల్టర్ బెడ్డు వద్ద హై హహోల్టేజీ కారణంగా వైర్లు కాలిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 780 గ్రామాలకు నిర్మల్ జిల్లా 92 గ్రామాలకు నీటిసరఫరా నిలిచింది. ఎస్ఆర్ ఎస్పీ నుంచి పైప్ లైన్ ద్వారా ఆదిలాబాద్ ,నిర్మల్ జిల్లాల్లాలకు నీటి సరఫరా అందిస్తున్నారు అధికారులు. మాడేగాం వద్ద నుంచి వచ్చే నీరు నిలిచిపోయింది. కేబుల్ కాలిపోవడంతో నీటి సరఫరా నిలిచింది. ఇక గత్యంతరం లేక ప్రజలు పాత బోర్లు, పాత ట్యాంక్ ల నీటిపై ఆధారపడుతున్నారు. మూడురోజులుగా తాగునీటి లేక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అసలే వానలకు జనం అతలాకుతలం అవుతుంటే నీటి సరఫరా పలు కారణంగా నిలిపి వేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు రెండు రోజులు కాదు ఇలా మూడు రోజులుగా చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజుల నుంచి మరమ్మత్తు పనులు చేస్తున్నారా? మరి నీటి పరిస్థితిని కూడా ఆరా తీయాలని సూచించారు. నీటికోసం పాత బోర్లు, పాత ట్యాంక్ ర్ల వెంట పడ్డామని మండిపడుతున్నారు. అధికారులు మాత్రం మరమ్మత్తు చేస్తున్నాం.. పునరుద్దరిస్తాం అంటూనే మూడు రోజులుగా ఇదే మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి త్వరగా మరమ్మత్తు పనులు చేయాలని కోరారు. సాయంత్రం లోపు నీటిని పునరుద్దరించాలని అధికారులకు కోరుతున్నారు.
Swayambhu : మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం వియత్నాం కు వెళ్లిన నిఖిల్..