Junior Doctors Protest At Rims: తెలంగాణలోని ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. రెండో రోజు రిమ్స్ మెడికల్ కాలేజీ ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికే కమిటి విచారణ పూర్తి అయింది. కాగా, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ ను తొలగించిన తరువాత విచారణ చేపట్టాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. రెండవ రోజు విధులకు దూరంగా వైద్య విద్యార్థులు ఉన్నారు. మరోసారి కాలేజ్ ముందు జూనియర్ డాక్టర్లు దిష్టి బొమ్మ దగ్దం చేశారు. దీంతో రిమ్స్ మెడికోల ఆందోళన ఉదృతం అవుతుంది.
Read Also: Parliament security breach: పార్లమెంట్ దాడి.. ప్రధాన సూత్రధారికి 7 రోజుల పోలీస్ కస్టడీ..
రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ ను తొలగించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. డైరెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగుతుంది. దీంతో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వద్ద కాసేపు నిరసన తెలియజేసి రిమ్స్ ప్రధాన గేటు దగ్గర జూనియర్ డాక్టర్లు రోడ్డు పైకెక్కిన నిరసన వ్యక్తం చేశారు. డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ ను తొలగించే వరకు ఆందోళన ఆపేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, బుధవారం నాడు రాత్రి వైద్య విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడి చేయడంతో.. ఆరుగురు హౌస్ సర్జన్లపై గుర్తు తెలియన దుండగులు దాడికి పాల్పడిన నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.