కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు ఉండటం మన అదృష్టం అని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే బీజేపీ- కాంగ్రెస్ నాయకులు మనకు అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ అని కాంగ్రెస్, గుజరాత్ లో రైతులపై బీజేపీ లాఠీచార్జి చేయింది అని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ పథకాలు బీజేపీ- కాంగ్రెస్ నాయకులు కూడా పొందుతున్నారు.. కేసీఆర్ కు ఓటేయకుంటే నష్టం పోతాం.. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవు.. రైతు సంక్షేమానికి పాటుపడ్డ ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్.. రైతాంగానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాలి అంటూ జోగు రామన్న డిమాండ్ చేశారు.
Read also: Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదం.. విచారణ ప్రారంభం
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ది పొందుతున్న ప్రతిపక్ష పార్టీల నేతలు.. ప్రజా క్షేత్రంలో మాత్రం ప్రభుత్వ పని తీరుపై విమర్శలు చేస్తూ రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శించారు. ప్రభుత్వ పథకాల ఫలాలు పొందుతూనే.. ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వక్ర బుద్ధి చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జైనథ్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్థానిక నేతలు, ఆలయ కమిటి సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ దర్శనం అనంతరం మండలంలో తొలి ప్రచారాన్ని లాంచనంగా ప్రారంభించారు.
Read also: Bengaluru: బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, అగ్నికి ఆహుతైన 10 బస్సులు.. వీడియో ఇదిగో!
అయితే, అంతకు ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహనికీ పూలమాలలు వేసి ఎమ్మెల్యే జోగు రామన్న ఘన నివాళి సమర్పించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తన స్వగ్రామమైన దీపాయిగూడతో పాటు.. ఆనంద్ పూర్, కూర, కరంజి, ఉంబిరి, ఖాప్రి, బెల్లూరి, బెల్గాం, మాకొడ గ్రామాల్లో ఆయన ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలలో ప్రభుత్వ పని తీరును వివరిస్తూ.. బీఆర్ఎస్ మానిఫెస్టోలో పొందుపరిచిన హామీల తీరును వివరించారు.
Read also: Hardhik Pandya: త్వరలోనే జట్టులో చేరనున్న స్టార్ ఆల్ రౌండర్.. నెట్‌లో ప్రాక్టీస్ షురూ..!
ఇక, కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఎమ్మెల్యే జోగు రామన్న స్వయంగా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేయడం విశేషంగా ఆకట్టుకుంది. రైతుబంధు ద్వార ఆర్ధిక సహాయాన్ని అందించడంతో పాటు.. మద్దతు ధరకే పంటల కొనుగోళ్ళు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. కాంగ్రెస్, బీజేపీల హయంలో రైతులు సంక్షోభాన్ని ఎదుర్కున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అన్నదాతలు ఆర్ధిక ప్రగతి సాధించాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారు.. మరోసారి ఆయనను ముఖ్యమంత్రిగా గెలిపించి మరిన్ని సంక్షేమ పథకాల ఫలాలు పొందాలని జోగు రామన్న కోరారు.