శుక్రవారం వచ్చిందంటే టాలీవుడ్ థియేటర్లలో ఎంత సందడి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి శుక్రవారం చిన్న, పెద్ద ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూ, సినీ ప్రియులకు వినోదాన్ని పంచుతాయి. అయితే ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గట్టిగానే షేక్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే మెగాస్టార్స్ చిరంజీవి, చరణ్ కలిసి నటించిన “ఆచార్య” రిలీజ్ కు రెడీగా ఉంది. ‘ఆచార్య’తో పాటు మరికొన్ని సినిమాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాలేంటో…
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ బడా మూవీ “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మొట్టమొదటిసారిగా మెగా స్టార్స్ చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే నటిస్తోందంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాజల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అందులో కాజల్ అగర్వాల్ మిస్ అయిందనే…
“ఆచార్య” ట్రైలర్ సినిమాలో కాజల్ రోల్ పై పలు అనుమానాలు రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆమె తల్లి కావడంతో మధ్యలోనే సినిమాలో నుంచి తప్పుకుందని, అప్పటికే ఆమెపై చిత్రీకరించిన సన్నివేశాలను మేకర్స్ సినిమాలో నుంచి కట్ చేశారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇలా చేయడం వల్ల కాజల్ కు, ‘ఆచార్య’ టీంకు మధ్య విబేధాలు వచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ విషయం గురించి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే RRRతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. చిరంజీవి, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. చిరు, చరణ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ 29న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమోషన్లలో వేగం పెంచారు. ఇందులో భాగంగా టాలీవుడ్ మీడియాతో…
‘ఆచార్య’తో తమ అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు, నటుడు రామ్ చరణ్ రెడీగా ఉన్నారు. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 29న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ‘ఆచార్య’ టీం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ తాజా ప్రెస్ మీట్…
టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ఆడియెన్స్ ను ఒకే దగ్గర కలిపి కూర్చోపెట్టగల సత్తా చూపించిన దర్శకుడు ప్రస్తుతం చిరంజీవి తో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రొమొతిఒన్స్ లో పాల్గొన్న కొరటాల తన తదుపరి చిత్రాల…
ఈ మధ్యే విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్.’ టీమ్ అంటే డైరెక్టర్ రాజమౌళి, హీరోలు యన్టీఆర్, రామ్ చరణ్ ను సినిమా రిలీజ్ కు ముందు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేసి ఆకట్టుకున్నారు. అదే తీరున ఇప్పుడు ‘ఆచార్య’ చిత్రం కోసం చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివను మరో నోటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేయబోవడం విశేషం! ఆదివారం (ఏప్రిల్ 24న) ఈ ఇంటర్వ్యూ జరిగింది. సరిగ్గా 35 రోజుల వ్యవధిలో రెండు…
రాకింగ్ స్టార్ యష్ నటించిన “కేజీఎఫ్ చాప్టర్ 2” ప్రస్తుతం స్లో అయ్యే మూడ్‌లో లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శాండల్‌వుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. 10 రోజుల క్రితం విడుదలైన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. సినిమాపై ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. “కేజీఎఫ్ చాప్టర్ 2″కు ఫిదా అయిన స్టార్స్ జాబితాలో…
రాంబో (విజయ్ సేతుపతి) ఖతీజా (సమంత రూత్ ప్రభు), కన్మణి (నయనతార) మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’. తెలుగులో ఈ మూవీ “కన్మణి రాంబో ఖతీజా”గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి…
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో పూజా హెగ్డే ఒకరు. ఆమె నటించిన గత రెండు చిత్రాలు “బీస్ట్”, “రాధే శ్యామ్” బాక్సాఫీస్ వద్ద చతికిలపడడంతో ఇప్పుడు ‘ఆచార్య’పై ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్పించిన పూజా హెగ్డే తీరైన కట్టూ బొట్టుతో బుట్టబొమ్మలా అద్భుతంగా కన్పించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పొడుగు కాళ్ళ సుందరి ‘ఆచార్య’తో హిట్ అందుకుని, మళ్ళీ ఫామ్…