మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్…
అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జవాన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను, అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం నా అదృష్టం. మనం ఇక్కడ ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతున్నామంటే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, దేశ సైనికుల త్యాగాలే దానికి…
“జనతా గ్యారేజ్” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల, ఎన్టీఆర్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. తారక్ ఫ్యాన్స్ దృష్టి అంతా ఇప్పుడు NTR 30 పైనే. ‘ఎన్టీఆర్ 30’ ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. అయితే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో “ఎన్టీఆర్30” హీరోయిన్, స్టోరీ మొదలైన విషయాలను వెల్లడించారు. Read Also : Koratala Siva :…
మావెరిక్ దర్శకుడు కొరటాల శివ ఖాతాలో పలు ఆసక్తికరమైన చిత్రాలున్నాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉండగా, నెక్స్ట్ ‘ఎన్టీఆర్ 30’తో బిజీ కానున్నాడు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొరటాల మరో ఇద్దరు స్టార్ హీరోలను కూడా లైన్ లో పెట్టినట్లు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఆ ఇద్దరు స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్ కావడం విశేషం. Read Also : Ajay…
ఓ స్టార్ హీరో మరో స్టార్ సినిమాకు గాత్రం అరువివ్వడం అభిమానులకు ఆనందం పంచే అంశమే! తెలుగునాట వాయిస్ ఓవర్ అనగానే ముందుగా మహేశ్ బాబు గుర్తుకు వస్తారు. ఆయన వ్యాఖ్యానంతో వెలుగు చూసిన సినిమాలు బాగానే సందడి చేశాయి. ఇప్పుడు మరోమారు మహేశ్ వాయిస్ ఓవర్ వినిపించబోతోంది. అదీగాక, ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ కావడంతో ఫ్యాన్స్ కు మరింత సంబరంగా ఉంది. ‘ఆచార్య’ చిత్ర…
మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక గత రెండు రోజులుగా…
సౌత్ చందమామ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న పండంటి మెగా బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాజల్, గౌతమ్ దంపతులు తమ మొదటి బిడ్డకు నీల్ కిచ్లు అనే పేరును పెట్టారు. ఇక తల్లయ్యాక కాజల్ ఇన్‌స్టాగ్రామ్ లో మొదటి పోస్ట్ చేసింది. అందులో తన ప్రసవానంతరం గ్లామర్ గా ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అందంగా ఉంటుందంటూ రాసుకొచ్చింది. తన బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించిన అనుభవంపై సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేసింది. “నా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘RC15’ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ RC15లో రామ్ చరణ్ సరసన కథానాయికగా కనిపించనుంది. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు RC15 చిత్రానికి స్క్రిప్ట్ అందించగా, సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ పంజాబ్ లోని అమృత్ సర్ లో జరుగుతోంది. ఈ మేరకు పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్‌లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మెగా యాక్షన్ డ్రాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే టీం మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా, ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన “భలే భలే బంజారా” సాంగ్ లో తండ్రీకొడుకులు ఇద్దరూ ఇరగదీశారు. ప్రస్తుతం…
ఇంటర్వ్యూ వీడియోతో “ఆచార్య” ప్రమోషన్లను స్టార్ట్ చేశారు టీం. తాజాగా రామ్ చరణ్, కొరటాల శివ ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులు చెర్రీ, చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడే ‘ఆచార్య’ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి వచ్చింది. మాములుగా జక్కన్న తన సినిమా పూర్తయ్యేదాకా హీరోలను బయట ప్రాజెక్టుల్లో అడుగు పెట్టనివ్వడు. మరి చెర్రీ రెండు సినిమాలను ఎలా…