మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే RRRతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. చిరంజీవి, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. చిరు, చరణ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ 29న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమోషన్లలో వేగం పెంచారు. ఇందులో భాగంగా టాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయిన చెర్రీ ‘ఆచార్య’ హిందీ విడుదలపై క్లారిటీ ఇచ్చారు.
Read Also : Mahesh Babu : దుబాయ్ ట్రిప్ వెనుక అసలు ప్లాన్ ఇదా?
ఈ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ ‘ఆచార్య’ విడుదల గురించి మాట్లాడుతూ ఇతర భాషల్లో సినిమాను విడుదల చేయాలంటే డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం కావాలి. RRR, RC15 షూటింగ్ కారణంగా తనకు అంత సమయం లేదని చరణ్ వెల్లడించాడు. అయితే ‘ఆచార్య’ హిందీ వెర్షన్ త్వరలో విడుదల కానుందని, దానికి తానే డబ్బింగ్ చెబుతానని చెర్రీ చెప్పడం బాలీవుడ్ లో ఉన్న ఆయన అభిమానులను కాస్త నిరాశ పరిచే విషయమే. మరి ‘ఆచార్య’ బాలీవుడ్ కు ఎప్పుడు వెళ్తాడో చూడాలి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ మూవీ మణిశర్మ సంగీతం సమకూర్చారు.