‘ఆచార్య’తో తమ అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు, నటుడు రామ్ చరణ్ రెడీగా ఉన్నారు. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 29న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ‘ఆచార్య’ టీం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ తాజా ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేస్తానంటూ అధికారికంగా ప్రకటించి మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
Read Also : Ram Charan: ఎన్టీఆర్ మాల వేసుకోవడానికి కారణం నేను కాదు..
మెగా ఫ్యాన్స్ ఎంతకాలం నుంచో ఈ కాంబోను వెండితెరపై వీక్షించాలను కోరుకుంటున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి చేయనున్న ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు ఇప్పటికే జరిగాయని, ఆ మల్టీస్టారర్ సినిమాను తానే నిర్మిస్తానని చరణ్ కన్ఫర్మ్ చేశాడు. మరోవైపు ‘ఆచార్య’ కూడా మల్టీస్టారర్ మూవీనే. ఇప్పుడు తండ్రితో, అప్పుడు బాబాయ్ తో కలిసి చెర్రీ స్క్రీన్ షేర్ చేసుకుంటుండడం హాట్ టాపిక్ గా మారింది. మరి బాబాయ్, అబ్బాయ్ కలిసి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారో, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న RC 15 అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.