రాంబో (విజయ్ సేతుపతి) ఖతీజా (సమంత రూత్ ప్రభు), కన్మణి (నయనతార) మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’. తెలుగులో ఈ మూవీ “కన్మణి రాంబో ఖతీజా”గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఒకే సారి రెండు రిలేషన్ షిప్స్ మెయింటైన్ చేసే వ్యక్తి కథాంశంతో ఫన్నీగా ఉన్న ‘కాతు వాకుల రెండు కాదల్’ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
Read Also : Acharya Event : కాజల్ ఊసే లేదు… విలన్ని కూడా పక్కన పెట్టేశారే !?
ఈ ట్రైలర్‌లో విజయ్ సేతిపతి నయనతారను పెళ్లి చేసుకోవడంతోపాటు సమంతతో ఎఫైర్ సాగిస్తున్నట్లు చూపించారు. కాగా ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇది డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. ఆ మరుసటి రోజు అంటే 29న ‘ఆచార్య’ భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ సినిమాల హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ‘ఆచార్య’తో ‘కాతు వాకుల రెండు కాదల్’ మూవీ ఢీకొంటుందా? లేక తప్పుకుంటుందా? అనేది చూడాలి.