కొరటాల శివ నిన్న మొన్నటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడు. అయితే ఒక్క సినిమాతో ఆయన పరిస్థితి తలక్రిందులు అయింది. రచయితగా ‘భద్ర, మున్నా, నిన్ననేడు రేపు, ఒక్కడున్నాడు, సింహా, బృందావనం, ఊసరవెల్లి’ సినిమాలకు పని చేసి ‘మిర్చి’తో దర్శకుడుగా మారాడు. ఈ సినిమా ఘన విజయం కొరటాలను అందలం ఎక్కించింది. ఆ తర్వాత ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను’ సినిమాలతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఇన్ని సక్సెస్ లు ఉన్న…
భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన ఆచార్య సినిమాపై ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ కరెక్ట్ కాదని, సిద్ధ పాత్రలోనూ రామ్ చరణ్ చేయకుండా ఉంటే బాగుండేదని ఆయన బాంబ్ పేల్చారు. సంగీతమూ సరిగ్గా కుదరలేదంటూ కుండబద్దలు కొట్టారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే… ‘‘ఈమధ్యకాలంలో ఎర్ర సినిమాలు రావడం లేదు. ఇలాంటి టైంలో ఒక ఎర్ర సినిమా తీయాలని కొరటాలకు కోరిక…
ఒకే ఒక్క ఫ్లాప్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు అలర్ట్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచినా.. ఆచార్య ఫ్లాప్ ఎఫెక్ట్ మాత్రం.. ఈ ఇద్దరి అప్ కమింగ్ ఫిల్మ్స్ పై పడింది. దాంతో ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకుడదని.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగగా.. ఇప్పుడు చరణ్ కూడా అలాగే చేస్తున్నాడట. ఇంతకీ చరణ్ ఏ ప్రాజెక్ట్ విషయంలో అలా చేస్తున్నాడు..? ట్రిపుల్ ఆర్‌తో…
పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ నుంచి వచ్చిన ట్రిపుల్ ఆర్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాగే ఓటిటిలో నెంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. అయితే తెలుగులో భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్యకు.. థియేటర్లోనే కాదు, ఓటిటిలో కూడా భారీ ఎదురుదెబ్బే పడిందట. మరి ట్రిపుల్ ఆర్ ఓటిటిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఆచార్య పరిస్థితి ఎలా ఉంది..? దర్శక ధీరుడు తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.…
మెగాస్టార్ చిరంజీవి కు ఓటిటీ లో ఘోర అవమానం జరిగిందా ..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఒక సినిమా థియేటర్లో హిట్ కాకపోతే ఓటిటీలో తమ సత్తా చాటుతున్నాయి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఓటిటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా నటించిన ఆచార్య ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన విషయం విదితమే. ఇప్పటివరకు పరాజయాన్ని చవిచూడని దర్శకుడు…
రెండేళ్ల గ్యాప్‌తో రెండు సినిమాలు చేసి.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు ఆ యంగ్ డైరెక్టర్. దాంతో మూడో సినిమాకే మెగాస్టార్ నుంచి పిలుపొచ్చింది. అందుకే గత రెండేళ్లుగా చిరు కథ పైనే కసరత్తులు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అతనికి మెగా షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్.. ఏంటా కథ..? ఆచార్య సినిమా రిజల్ట్ ఎఫెక్ట్.. మెగాస్టార్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై పడనుందా అంటే.. ఖచ్చితంగా పడుతుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.…
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఎన్ని రోజులు ఆడుతుంది.. ఎంతవరకు ప్రేక్షకులను చేరుతుందో చెప్పడం చాలా కష్టం. ఇక ఈ ఏడాది రిలీజ్ అయినా పెద్ద సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’, కెజిఎఫ్ 2 తప్ప మిగిలిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినవే. ఇక సినిమా హిట్ టాక్ అందుకుంటే ఓటిటీలో కొన్నిరోజులు ఆలస్యంగా వస్తుంది.. బోల్తా కొడితే కొంచెం ముందుగానే ఓటిటిలోకి అడుగుపెడుతోంది. ఇక తాజాగా ఆచార్య పరిస్థితి అలాగే ఉంది. ఎన్నో…
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆచార్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన విషయం అందరికీ తెలుసు! చిరంజీవి, రామ్ చరణ్ లాంటి క్రేజీ స్టార్స్ ఉన్నా.. కథ – కథనాలు సరిగ్గా లేకపోవడంతో నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. దీంతో, రెండో రోజు నుంచే ఆడియన్స్ ఈ సినిమాని తిరస్కరించారు. తద్వారా ఇది భారీ నష్టాల్ని మిగిల్చింది. చిరు, చరణ్‌ల క్రేజ్.. కొరటాల ట్రాక్ రికార్డ్ చూసి.. ఫ్యాన్సీ రేట్లకు ఈ సినిమా…
అభిమానం.. అనేది ఎవరు ఆపలేనిది. ఒక నటుడును అభిమానులు అభిమానిస్తున్నారంటే గుండెల్లో పెట్టుకుంటారు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే వారికి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఆచార్య సినిమా రిలీజ్ అయిన విషయం విదితమే.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. నిన్న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయినా అభిమానానికి హిట్,…
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ అంటే టక్కున వినపడే పేర్లు రశ్మిక, పూజా హేగ్డే. అయితే ఈ మధ్య కాలంలో పూజా వరుస పరాజయాలను ఫేస్ చేస్తూ వస్తోంది. తాజాగా ఏకంగా ప్లాఫ్ లలో హ్యాట్రిక్ సైతం కొట్టేసింది. అమ్మడి హ్యాట్రిక్ కి ‘ఆచార్య’ బ్రేక వేస్తుందని అందరూ ఆశించినా అది నెరవేరలేదు. ఈ మెగా మల్టీస్టారర్ సైతం పూజకు హ్యాండిచ్చింది. దీంతో పూజ హ్యాట్రిక్ ప్లాఫ్ లను ఎదుర్కొవలసి వచ్చింది. ఒక్కో సినిమాకు మూడు…