మెగాస్టార్ చిరంజీవి కు ఓటిటీ లో ఘోర అవమానం జరిగిందా ..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఒక సినిమా థియేటర్లో హిట్ కాకపోతే ఓటిటీలో తమ సత్తా చాటుతున్నాయి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఓటిటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా నటించిన ఆచార్య ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన విషయం విదితమే. ఇప్పటివరకు పరాజయాన్ని చవిచూడని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకొని థియేటర్ కు వెళ్లి నిరాశతో వెనుతిరిగారు. ఇక థియేటర్ లో పొతే పోయింది కనీసం ఓటిటీలోనైనా ఆచార్య తన సత్తా చాటిద్దేమో అని అనుకున్నారు.. కానీ ఇక్కడ ఆచార్య నష్టాలనే మిగిల్చిందని టాక్.
సినిమా హిట్ అవ్వకపోయినా కొంతమంది ప్రేక్షకులు ఓటిటీ లో సినిమా చూసి అనేక సన్నివేశాలు మరియు ఎపిసోడ్‌లను కూడా ట్రోల్ చేస్తారు. కానీ ఆచార్య లో ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. ఎందుకంటే అస్సలు చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇక ఈ లెక్కన చెప్పుకుంటే ఇది చిరుకు ఘోర అవమానమనే చెప్పుకోవాలి. కథ, కథనం పక్కన పెట్టినా చిరు కోసమే సినిమాలు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు.. వారు కూడా ఈ సినిమాను లైట్ తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా ఆచార్య విషయంలో ఎవరు ఎలా ఉన్నా నిర్మాతలు మాత్రం భారీ నష్టపోయారు.. వారితో పాటు అమెజాన్ వారు కూడా భారీ నష్టాలను చవిచూస్తున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఏమైనా పుంజుకుంటుందేమో చూడాలి.