రెండేళ్ల గ్యాప్‌తో రెండు సినిమాలు చేసి.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు ఆ యంగ్ డైరెక్టర్. దాంతో మూడో సినిమాకే మెగాస్టార్ నుంచి పిలుపొచ్చింది. అందుకే గత రెండేళ్లుగా చిరు కథ పైనే కసరత్తులు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అతనికి మెగా షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్.. ఏంటా కథ..?
ఆచార్య సినిమా రిజల్ట్ ఎఫెక్ట్.. మెగాస్టార్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై పడనుందా అంటే.. ఖచ్చితంగా పడుతుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆచార్య తర్వాత చిరంజీవి వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. వాటిలో రెండు స్ట్రెయిట్ ఫిల్మ్స్ కాగా.. రెండు రీమేక్ చిత్రాలు. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్‌గా గాడ్ ఫాదర్.. వేదాలం రీమేక్‌గా మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ తెరకెక్కుతున్నాయి. ఇక బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య రూపొందుతోంది. అలాగే యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అఫీషియల్ అనౌన్స్ మెంట్ తప్పితే.. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పటికే వెంకీ చిరు కోసం అదిరిపోయే స్క్రిప్టు రెడీ చేశాడని.. ఈ సినిమా మరో ఠాగూర్ అవడం ఖాయమని.. వినిపించింది. అయితే ఇప్పుడు.. వెంకీ బౌండెడ్ స్క్రిప్ట్‌తో చిరుని మెప్పించలేకపోయారని తెలుస్తోంది. దాంతో చిరు ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టినట్టు భోగట్టా. దాంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా పుకారేనా.. లేక నిజంగానే సినిమా క్యాన్సిల్ అయిందా.. అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ‘ఛలో’ ‘భీష్మ’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ.. చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకుంటాడా.. లేదా.. మిస్ చేసుకుంటాడా.. అనేది వేచి చూడాలి.