ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఎన్ని రోజులు ఆడుతుంది.. ఎంతవరకు ప్రేక్షకులను చేరుతుందో చెప్పడం చాలా కష్టం. ఇక ఈ ఏడాది రిలీజ్ అయినా పెద్ద సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’, కెజిఎఫ్ 2 తప్ప మిగిలిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినవే. ఇక సినిమా హిట్ టాక్ అందుకుంటే ఓటిటీలో కొన్నిరోజులు ఆలస్యంగా వస్తుంది.. బోల్తా కొడితే కొంచెం ముందుగానే ఓటిటిలోకి అడుగుపెడుతోంది. ఇక తాజాగా ఆచార్య పరిస్థితి అలాగే ఉంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
మెగాస్టార్ చిరంజీవి- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్- స్టార్ మేకర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందు అంచానాలు ఆకాశాన్ని అంటాయి. కానీ థియేటర్లో మాత్రం ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో 20 రోజులకే ఓటిటిలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ‘ఆచార్య’ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. మే 20 నుండి 240 కంటే ఎక్కువ దేశాలు మరియు ప్రాంతాలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రసారం కానుంది. సాధారణంగా ఓటీటీ నిబంధనల ప్రకారం అయితే ఆరువారాలు తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ ఈ సినిమా ఆ రూల్స్ ను బ్రేక్ చేస్తూ 20 రోజులకే ఓటిటిలోకి అడుగుపెడుతుంది. అందులో మెగాస్టార్ సినిమా ఇలా 20 రోజులకే అమెజాన్ లో రావడం మెగా అభిమానులను మరింత నిరాశకు గురిచేస్తోంది.
they call him Acharya because he always teaches them a lesson💥#AcharyaOnPrime, May 20 pic.twitter.com/5l4wnFgLn7
— amazon prime video IN (@PrimeVideoIN) May 13, 2022