మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆచార్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన విషయం అందరికీ తెలుసు! చిరంజీవి, రామ్ చరణ్ లాంటి క్రేజీ స్టార్స్ ఉన్నా.. కథ – కథనాలు సరిగ్గా లేకపోవడంతో నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. దీంతో, రెండో రోజు నుంచే ఆడియన్స్ ఈ సినిమాని తిరస్కరించారు. తద్వారా ఇది భారీ నష్టాల్ని మిగిల్చింది. చిరు, చరణ్‌ల క్రేజ్.. కొరటాల ట్రాక్ రికార్డ్ చూసి.. ఫ్యాన్సీ రేట్లకు ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డున పడ్డారు.
ఈ విషయం తెలిసి, డిస్ట్రిబ్యూటర్స్‌ని ఆదుకోవడానికి చిరంజీవి రంగంలోకి దిగబోతున్నారు. సినిమా రిలీజయ్యాక మే మొదటివారంలో తన భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్ళిన చిరు, అక్కడి నుంచి తిరిగి రాగానే ఆచార్య నష్టాల్ని పూడ్చే పనుల్లో నిమగ్నం కానున్నారు. ఆల్రెడీ కొరటాల శివ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. నిర్మాతతో కలిసి.. ఎవరెవరికి, ఎన్నెన్ని నష్టాలు వచ్చాయి? ఎంతెంత ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు చిరుతో పాటు చరణ్ కూడా ముందుకొచ్చి, తమని నమ్మి సినిమా హక్కుల్ని కొని నష్టపోయిన వారిని సేవ్ చేసేందుకు ముందుకొస్తున్నారు.
ఇదిలావుండగా.. చిరు ప్రస్తుతం గాడ్‌ఫాదర్, భోళా శంకర్, మెగా154 సినిమాలు చేస్తున్నారు. గాడ్‌ఫాదర్, భోళా శంకర్ చిత్రాలు వరుసగా లూసిఫర్, వేదాళం చిత్రాలకు రీమేక్ కాగా.. బాబీతో చేస్తోన్న మెగా154 మాత్రం ఒరిజినల్ స్క్రిప్ట్. ఆచార్య నష్టాల వ్యవహారాలు చూసుకున్నాక, బాబీ ప్రాజెక్ట్ షూట్‌లో చిరు పాల్గొననున్నారు. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.