Ram charan : ఒక్క ఫ్లాప్.. ఎన్టీఆర్, చరణ్ అలర్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకే ఒక్క ఫ్లాప్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు అలర్ట్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచినా.. ఆచార్య ఫ్లాప్ ఎఫెక్ట్ మాత్రం.. ఈ ఇద్దరి అప్ కమింగ్ ఫిల్మ్స్ పై పడింది. దాంతో ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకుడదని.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగగా.. ఇప్పుడు చరణ్ కూడా అలాగే చేస్తున్నాడట. ఇంతకీ చరణ్ ఏ ప్రాజెక్ట్ విషయంలో అలా చేస్తున్నాడు..?
Also Read
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ట్రిపుల్ ఆర్‌తో భారీ విజయాన్ని అందుకొని.. పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు ఎన్టీఆర్, రామ చరణ్. అయితే ఈ సినిమా తర్వాత ఇద్దరు కూడా ఒకే దర్శకుడితో పని చేయడం విశేషం. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటించాడు చరణ్. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ ఫ్లాప్ అందుకుంది. దాంతో తన నెక్ట్స్ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఏ చిన్న ఛాన్స్ కూడా తీసుకోవడం లేదట. ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమా ఎప్పుడో మొదలైపోయింది కాబట్టి.. అప్ కమింగ్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట. శంకర్ సినిమా తరువాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు చరణ్. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో రామ్ చరణ్ అస్సలు కాంప్రమైజ్ అవడం లేదట.
రీసెంట్‌గా చరణ్‌ను కలిశాడట ఈ గౌతమ్ తిన్ననూరి. దాంతో కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా సూచనలు ఇచ్చాడట చరణ్. అలాగే.. పక్కాగా ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా బౌండెడ్ స్క్రిప్ట్ తో వచ్చాకే.. స్టోరీ నచ్చాకే ఫైనల్ చేస్తానని చెప్పాడట. దీంతో ప్రస్తుతం గౌతమ్ ఫుల్ స్క్రిప్ట్‌ని పక్కాగా పూర్తి చేసే పనిలో వున్నారట. ఇక ఎన్టీఆర్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాలతో ఓ సినిమా చేస్తున్నారు. దాంతో ఆచార్య రిజల్ట్ ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్‌ను కాస్త పరేషాన్ చేస్తోంది. అందుకే కొరటాలతో కూర్చొని స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట యంగ్ టైగర్. ఇలా ట్రిపుల్ ఆర్ హీరోల పై ఆచార్య ఎఫెక్ట్ భారీగానే పడిందని చెప్పొచ్చు. మరి అప్ కమింగ్ సినిమాలతో ఎన్టీఆర్, చరణ్ ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!