అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వినాయకుని నిమజ్జనం శోభాయాత్రలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చేనేత కాలనీలో ఏర్పాటు చేసిన 20 అడుగులు గల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి విగ్రహం కిందపడింది.
తమిళ హీరో జీవా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా అడ్డు వచ్చిన బైక్ ని తప్పించడానికి ప్రయత్నించడంతో కారు ప్రమాదానికి గురై అక్కడున్న బారికేడ్ ని గుద్దింది.
తమిళనాడులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. చెయ్యార్ పట్టణం సమీపంలో చెన్నైకి వెళ్తున్న వ్యాన్, బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయింది. కాగా.. ఈ ప్రమాదం జరగ్గానే ఇద్దరు ప్రయాణికులు కొద్దిసేపు గాల్లోనే ఉండి కిందపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఇప్పటికే రోజుకో మలుపు.. పూటకో ట్విస్ట్ ఈ కేసులో వెలుగు చూస్తుండగా.. ఇప్పుడు.. దివ్వెల మాధురిపై కేసు నమోదు చేశారు పోలీసులు..
Uttarakhand : ఆషాఢ మాసంలో మహాదేవుడు శివుడిని దర్శించుకునేందుకు భక్తులు స్వామి వారి కవాడ్ను మోసుకుని అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణించే సమూహాలను రోడ్లపై తరచుగా చూస్తుంటాము.
Suryapet Crime: సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. గీత కార్మికుడైన ఓ వృద్దుడు తనకు ఇన్నాళ్లు జీవనోపాధిని ఇచ్చిన తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారం స్టేజీ సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఆగి ఉంది.
పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సుకు తృటిలో ప్రమాదం తప్పిన ఘటన సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్ల పొదల్లోకి పాఠశాల బస్సు వేగంగా దూసుకెళ్లడంతో విద్యార్థులు భయాందోళన గురయ్యారు. డంపింగ్ యార్డ్ వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించే క్రమంలో రోడ్డు దాటి అదుపుతప్పి చెట్లలోకి పాఠశాల బస్సు దూసుకెళ్లింది. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాగా స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులను బస్సులో నుండి బయటకు…