జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా.. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. యాత్రికులతో నిండిన బస్సు యూపీలోని హత్రాస్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శివ్ ఖోడికి వెళుతోంది.
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో ప్రమాదం జరిగింది. జి.కొండూరులోని పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ టైర్లు పేలి వాహనం పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో కలకోటి ప్రవీణ్ (36) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట వద్ద ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన మృతులు సత్యనారాయణ, రుక్మిణి దంపతులు 75 ఏళ్లు పైబడిన వారు కారులో ప్రయాణిస్తుండగా ఘటన జరిగింది. కారును నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై రాంగ్ రూట్ లో వెళుతుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం తాకిడికి వాహనం దగ్ధమైంది.…
తెలుగు సీరియల్ యాక్టర్ పవిత్ర జయరాం మృతి చెందారు.మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరామ్ మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో పవిత్ర అక్కడిక్కడే మరణించారు.కర్ణాటకలోని తన సొంత వూరుకి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా తన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు సమాచారం. ఆమెతో పాటు కారులో తన తోటి నటులు…
యూపీలోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝాన్సీ-కాన్పూర్ హైవేపై డీసీఎం, కారు ఢీకొన్నాయి. కొద్దిసేపటికే రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో కారులోని వరుడితో సహా నలుగురు సజీవదహనమయ్యారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారి సమీపంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి తుని వైపు వెళ్తోన్న కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు రాగానే డివైడర్ను ఢీకొని అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది.