Ganesh Immersion: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వినాయకుని నిమజ్జనం శోభాయాత్రలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చేనేత కాలనీలో ఏర్పాటు చేసిన 20 అడుగులు గల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి విగ్రహం కిందపడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా.. మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Read Also: Andhra Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన