తమిళ హీరో జీవా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా అడ్డు వచ్చిన బైక్ ని తప్పించడానికి ప్రయత్నించడంతో కారు ప్రమాదానికి గురై అక్కడున్న బారికేడ్ ని గుద్దింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుంది. హీరో, అతని భార్య క్షేమంగా బయటపడినట్లు సమాచారం. కన్నియమూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
READ MORE: Karnataka: స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టిన యువకుడు..
తమిళ హీరో జీవా తెలుగులో రంగం సినిమాతో పరిచయమ్యాడు. తెలుగులో యాత్ర-2 సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందాడు. అంతేకాకుండా 1983 ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కించి మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించాడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో సినిమాలతో నిమగ్నమయ్యాడు.
READ MORE: Rahul Gandhi: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ మద్దతు..
పోలీసుల విచారణ:
ఇందులో జీవాకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు. అనంతరం చిన్నసేలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే జీవా కుటుంబ సమేతంగా మరో కారులో సేలం వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.