Accident: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ స్లీపర్ కోచ్ బస్సు టెంపోను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతుల మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. బారీ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 11Bలోని సునిపూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. టెంపోలో ప్రయాణిస్తున్న వారందరూ బారీ నగరంలోని గుమత్ మొహల్లా నివాసితులు. వీరంతా బరౌలి గ్రామంలో భాత్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు.
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కరౌలి-ధోల్‌పూర్ హైవే (NH 11B)పై సునిపూర్ గ్రామ సమీపంలో స్లీపర్ కోచ్ బస్సు టెంపోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంకా పలువురికి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read also: Muzaffarnagar: ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో వీధుల్లోకి వచ్చిన వేలాది మంది ముస్లింలు