Maha Kumbh: మహా కుంభమేళా వెళ్లి వస్తుండగా విషాదం చోటు చేసుకుంది. శనివారం బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో కారు డివైడర్‌ని ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు నేపాలీలు మరణించారు. మధుబని నాలుగు లేన్ల బైపాస్‌లో వేగం వెళ్తున్న కారు, బైక్‌ని తప్పించబోయి డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా పడింది. స్టంట్స్ చేస్తున్న బైకర్‌ని తప్పించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.
గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ ప్రమాదానికి గురైన మరణించిన విషయం తెలిసిందే. రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతాన్ని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పిఠాపురం పర్యటనకు వెళ్తున్న ఆయన మార్గ మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.
సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులున్నారు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు.. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. అయితే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని... వారిని క్రిటికల్ కేర్ సెంటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు అధికారులు.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. హుజరాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుంది. స్థానికులు కేకలు వేయడంతో కొంత దూరం వెళ్లిన లారీ డ్రైవర్ ఆపాడు. మానకొండూర్ మండలం కెల్లెడు గ్రామానికి చెందిన దివ్యశ్రీ గా గుర్తించారు. ములుగు జిల్లా పర్యటనకు వెళుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్..
అల్లూరి సీతారామరాజు జిల్లా గంట్యాడ మండలం ఎగువ కొండపర్తిలో గల వైకుంటగిరి అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి వస్తుండగా బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Diwali Accident : దీపావళి అంటే దీపాలు, పటాకుల పండుగ. ఈ రోజున ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. దీపావళికి పటాకులు పేల్చే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది.
Accident: రాజస్థాన్లోని ధోల్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ స్లీపర్ కోచ్ బస్సు టెంపోను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతుల మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. బారీ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 11Bలోని సునిపూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. టెంపోలో ప్రయాణిస్తున్న వారందరూ బారీ నగరంలోని గుమత్ మొహల్లా నివాసితులు.…