Ustad Bhagat Singh: ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారిన ఉస్తాద్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ‘ఓజీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమా తర్వాత, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో రిపీట్ అవుతుండడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని గట్టిగా నమ్ముతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే, ఈ సినిమా విజయం అభిమానులకు మాత్రమే కాదు.. చిత్ర దర్శకుడు మరియు హీరోయిన్ కెరీర్‌లకు కూడా అత్యంత కీలకంగా మారింది. దర్శకుడు హరీష్ శంకర్‌కు ఈ సినిమా రిజల్ట్ ఒక అగ్నిపరీక్ష లాంటిదనే చెప్పాలి.
Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. బాక్సాఫీస్ బద్దలే!
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
చివరగా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’తో భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్న హరీష్, తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి మళ్ళీ ఫామ్‌లోకి రావాలని ఆయన చూస్తున్నారు. ఒకవేళ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గనుక ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే, హరీష్ శంకర్ కెరీర్ డైలమాలో పడే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమాను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగా చేస్తున్నారు. ఇక హీరోయిన్ శ్రీలీల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వరుస ఆఫర్లతో టాలీవుడ్‌ను ఊపేసిన ఈ బ్యూటీ, సరైన సక్సెస్ లేక సతమతమవుతోంది. పేరుకు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నా, కమర్షియల్ హిట్టు పడకపోవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోంది. ‘ఉస్తాద్’ సాలిడ్ హిట్ అయితే తప్ప.. టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. అలాగే, మరో హీరోయిన్‌గా నటిస్తున్న రాశి ఖన్నా కూడా ఈ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తోంది. మరి మార్చి 19న విడుదల కానున్న’ఉస్తాద్ భగత్ సింగ్’ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: Peddi: ఫైనల్ టచ్.. పది రోజులే?
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!