వన్డే వరల్డ్‌కప్-2023లో గెలిచే జట్లలో భారత జట్టు హాట్ ఫేవరేట్ అని శ్రీలంక మాజీ స్విన్నర్ ముత్తయ్య మురళీధరన్ జోస్యం చెప్పాడు. భారత్ లో వరల్డ్ కప్ ఆడుతున్నందున టీమిండియాకు అవకాశాలున్నాయన్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడే ఛాన్స్ ఉందని మురళీధరన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Read Also: Karumuri Nageswara Rao: చంద్రబాబును సీఎం చేయాలన్నదే పవన్ అజెండా
ఈ వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్, భారత్‌లు తలపడితే చూడాలనుకుంటున్నాను అని ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. భారత్ జట్టు స్వదేశంలో ఆడుతుంది.. కాబట్టి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా ఉండబోతుందని పేర్కొన్నాడు.
Read Also: Singapore: మద్యం మత్తులో సహోద్యోగి చెవిని కొరికినందుకు భారతీయుడికి జైలు శిక్ష
ఇక ఇదే అంశంపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఉపఖండం నుంచి వచ్చే జట్లకు ఈ ప్రపంచకప్ లో మంచి విజయావకాశాలున్నారు. ఇక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయని సెహ్వాగ్ చెప్పాడు. ఆఫ్ఘానిస్తాన్‌లో ప్రతిభావంతులైన స్పిన్నర్లున్నారన్నాడు. కానీ వారి బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉందన్నాడు. కావున వారికి విజయావకాశాలు తక్కువేనని పేర్కొన్నాడు.
2011 లో రెండు అత్యుత్తమ జట్లైన శ్రీలంక, భారత్‌లు ఫైనల్‌కి వచ్చాయి.
Read Also: Kottu Satyanarayana: వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్.. పవన్ ప్రసంగాలు ఉన్మాదికి ఎక్కువ, పిచ్చికి తక్కువ
అయితే, టీమిండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనలిస్ట్ గా వస్తాయని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అయితే, అక్టోబర్ 5న ప్రారంభమవుతున్నా.. ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ని ఐసీసీ రిలీజ్ చేసింది. టోర్నీలో ఫస్ట్ మ్యాచ్ అక్టోబర్ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుండగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడనుంది.