ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మహమ్మద్ షమీ ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. అయితే అతని స్థానాన్ని ఏ ఆటగాడితో భర్తీ చేయాలన్న గుజరాత్ మేనెజ్మెంట్కు.. అతనొక వజ్రాయుధంలా దొరికాడు. షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అంతగా రాణించలేకపోతున్నాడు. వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ప్రత్యర్ధి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. 35 ఏళ్ల లేటు వయసులో ఇరగదీస్తున్నాడు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈరోజు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
Malladi Vishnu: వాలంటీర్ వ్యవస్థను చూసి భయపడిపోతున్నారు..
ఇక.. చివరి ఓవర్‌లో మోహిత్ శర్మ మరింత రెచ్చిపోయాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ మోహిత్ శర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఔరా అనిపించాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో తన కోటా చివరి రెండు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చిన మోహిత్.. ఆ తర్వాత సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో తన కోటా చివరి రెండు ఓవర్లలో 19 పరుగులిచ్చాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మోహిత్ అదే తరహాలో బౌలింగ్ చేసి తన కోటా చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుత సీజన్‌లో మోహిత్ ప్రదర్శన చూసి గుజరాత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోహిత్ మాస్టర్ క్లాస్ బౌలర్ అంటూ కితాబునిస్తున్నారు. అంతేకాకుండా.. షమీ లేని లోటు తీర్చుతున్నావంటూ పేర్కొంటున్నారు.