Malladi Vishnu: పెన్షన్ పంపిణీపై టిడిపి చెడు ప్రచారాన్ని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఖండించారు. వాలంటీర్ వ్యవస్థను చూసి భయపడిపోతున్నారని.. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ తరపున ఆరుగురు మాట్లాడారని ఆయన తెలిపారు. పెన్షన్ ఆపింది మీరే.. ఇవ్వాలని గొడవలు చేసేది మీరే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమ ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చెప్పాలన్నారు. చంద్రబాబు 50 రూపాయలు ఇచ్చారని.. రాజశేఖర్ రెడ్డి వచ్చి 200 చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమ అబద్ధాలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారన్నారు.
Read Also: Chandrababu: మార్కాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ ఆయన విమర్శించారు. దేవినేని ఉమా ఇరిగేషన్ మంత్రిగా చేసిన అవినీతి వల్ల మైలవరంలో ఘోర పరాజయం పొందాడని ఆరోపించారు. చంద్రబాబు 66 లక్షల పెన్షనర్ల ఓటు వల్ల ఓడిపోవడం ఖాయమన్నారు. ప్రజలకు, పెన్షనర్లు, సచివాలయం సిబ్బందికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోందన్నారు. 66 లక్షల మంది పెన్షన్ ప్రతీనెల 1న ఇంటి వద్దకే ఇవ్వాలనే మార్గాన్ని జగన్ ప్రవేశపెట్టారని మల్లాది విష్ణు వెల్లడించారు. చంద్రబాబు తొత్తు సిటిజన్ ఫర్ డెమోక్రసీ చేసిన తప్పుతో పెన్షనర్లు గందరగోళంలో ఉన్నారన్నారు. మూడు నెలలు సచివాలయం కెళ్లి పెన్షన్ తీసుకోనేలా చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.