దులీప్ ట్రోఫీలో యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో ముషీర్ ఖాన్ సెంచరీతో అదరగొట్టగా, ఇప్పుడు బౌలింగ్ విభాగంలో ఆకాశ్ దీప్ చెలరేగాడు. తొలి మ్యాచ్‌లోనే ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇండియా బితో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు.
క్రికెట్ మైదానంలో కొన్నిసార్లు ఫన్నీ సీన్లు చూస్తుంటాం. వాటిని చూస్తే నవ్వు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. బంగ్లాదేశ్-జింబాబ్వే మధ్య జరిగిన నాలుగో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. జింబాబ్వే ఫీల్డర్లు వికెట్ త్రో కొట్టడానికి పడుతున్న విన్యాసాలను చూస్తే మరీ ఇంత చిన్నపిల్లల్లా ఉన్నారేంట్రా బాబు అని అంటారు. మిడిల్ గ్రౌండ్‌లో చేసిన ఫీల్డింగ్ చూసి మీరు కడుపుబ్బ నవ్వుకుంటారు. కాగా.. జింబాబ్వే ఫీల్డర్ల చిన్నపిల్లల చర్యల వీడియో సోషల్ మీడియాలో హల్…
టీమిండియాకు ఆడటం అనేది ప్రతి భారతీయ క్రికెటర్ కల. అయితే.. కొంతమంది క్రికెటర్లు విజయం సాధిస్తుండగా, మరికొంత మంది నిరాశ చెందుతున్నారు. టీమిండియాలో అడుగుపెట్టి వారి స్థానాన్ని నిలబెట్టుకోలేక మళ్లీ తిరిగి పునరాగమనం చేయడానికి చాలా కష్టపడుతున్నారు కొందరు క్రికెటర్లు. అలాంటి క్రికెటర్లలో ఖలీల్ అహ్మద్ ఒకరు. తాజాగా.. టీ20 ప్రపంచకప్-2024కి ఎంపికైన టీమిండియా రిజర్వ్ ఆటగాళ్లలో ఖలీల్ ఉన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బ్యాటింగ్ విభాగంతో పాటు బౌలింగ్ విభాగం కూడా చాలా బలంగా ఉంది. అందుకు నిదర్శనం.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో చెన్నై ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరణ తీసిన వికెట్లే. ఆ మ్యాచ్లో పతిరణ యార్కర్లతో విరుచుకుపడ్డాడు. గంటకు 150 కి.మీ వేగంతో యార్కర్ బౌలింగ్ వేసి ఒకే ఓవర్ లో రెండు కీలక వికెట్లు తీశాడు. కళ్లు మూసి తెరిచేలోపు బంతి జట్ స్పీడ్ తో దూసుకుపోయింది. 15 ఓవర్లో పతిరణ…
ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మహమ్మద్ షమీ ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. అయితే అతని స్థానాన్ని ఏ ఆటగాడితో భర్తీ చేయాలన్న గుజరాత్ మేనెజ్మెంట్కు.. అతనొక వజ్రాయుధంలా దొరికాడు. షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అంతగా రాణించలేకపోతున్నాడు. వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ప్రత్యర్ధి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. 35 ఏళ్ల లేటు వయసులో ఇరగదీస్తున్నాడు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈరోజు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్లో…
వన్డే ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెండ్ బౌల్ట్ ఓ అరుదైన ఘనత సాధించాడు. తన జట్టు తరుఫున 50కు పైగా వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా బౌల్ట్ రికార్డ్ సృష్టించాడు. ఈరోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కుశాల్ మెండీస్ వికెట్ తీసి ఈ ఫీట్ సాధించాడు.
జస్ప్రీత్ బుమ్రా వన్డే ప్రపంచ కప్ 2023లో ఓ అరుదైన ఘనత సాధించాడు. 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో ఏ ఇండియన్ బౌలర్ చేయలేని ఘనతను సాధించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లనే తొలి బంతికే వికెట్ తీశాడు.
2023 వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో అన్నింటిలో గెలిచి విజయకేతనం ఎగురవేసింది. ఇక తర్వాతి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తో తలపడనుంది. రేపు(ఆదివారం) లక్నోలో ఈ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. రేపటి మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. లక్నోలో స్పిన్ కు ఎక్కువగా అనుకూలిస్తుంది కావున.. అతని స్థానంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకురానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
టీమిండియా తరపున తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న ముకేశ్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్ లో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. హలో అమ్మా.. నీ ప్రార్థనలు ఫలించాయని అన్నాడు. ఎట్టకేలకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందంటూ తల్లితో ముకేశ్ తెలిపాడు. దీంతో ముకేశ్ తల్లి స్పందిస్తూ.. సంతోషంగా ఉండు.. కెరీర్‌లో మరింత ఎదిగాలి అని దీవెనలు ఇచ్చింది.