ఐపీఎల్ 2023 సీజన్ లో వరుస విజయాలతో పాయింట్ టేబుల్ లో టాపర్ గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. రాజస్థాన్ రాయల్స్ తో ఇవాళ అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీ ఫస్టాఫ్ లో ఏడు మ్యాచ్ ల్లో ఐదు గెలిచిన సీఎస్కే..రెండో దశలోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. మరో వైపు వరుసగా రెండో మ్యాచుల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్.. చెన్నైపై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది. బలబలాల దృష్ట్యా రెండు జట్లు సమతూకంగా ఉండటంతో హోరా హోరీ పోరు తప్పేలా లేదు.
Read Also : PM Modi: కాంగ్రెస్ అంటేనే అవినీతి, బంధుప్రీతికి గ్యారెంటీ..
చెన్నై సూపర్ కింగ్స్ విజయ రహస్యం.. సమిష్టిగా రాణిస్తుండటం.. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్ లైనఫ్ భీకరంగా ఉంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అద్భుతమైన బ్యాటింగ్ తో ఆరంభాలు ఇస్తుంటే వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే.. ఆల్ రౌండర్ శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. సూపర్ పెర్ఫామెన్స్ తో రహానే మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోగా.. శివమ్ దూబే కెరీర్ బెస్ట్ ఐపీఎల్ పెర్ఫామెన్స్ కనబరుస్తున్నాడు.
Read Also : KTR: బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభ.. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్
కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఇద్దరూ ఆడిన ఇన్సింగ్స్ అసాధారణం.. ఫినిషర్ గా ధోనీ, జడేజా అదరగొడుతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతున్న అంబటి రాయుడికి బ్యాటింగ్ చేసే అవకాశాలు పెద్దగా రాకపోయినా.. ఆడిన బంతులను భారీ షాట్లుగా మలుస్తున్నారు. బౌలింగ్ లో తుషార్ దేశ్ పాండే, ఆకాశ్ సింగ్, మతీష పతీరణ సత్తా చాటుతుండగా.. స్పిన్నర్లుగా మహీశ్ తీక్షణ, రవీంద్ర జడేజా దుమ్మురేతున్నారు. మొయిన్ అలీ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు.
Read Also : MLA Kethireddy Venkatarami Reddy: సీఎం కాన్వాయ్‌ను రైతులు అడ్డుకునే ప్రయత్నం పక్కా ప్లానే!
ఈ అసాధారణ ప్రదర్శనతోనే చెన్నై సూపర్ కింగ్స్ గత మూడు మ్యా్చ్ ల్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయాలను సాధిచింది. అయితే జైపూర్ వేదికగా జరిగే ఇవాళ్టి మ్యాచ్ లో సీఎస్కే వ్యూహాత్మక మార్పులు చేసే అవకాశం ఉంది. సావాయి మాన్ సింగ్ స్టేడియం పిచ్ చాలా స్లోగా ఉంటుంది. స్పిన్నర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంది. ఇక్కడ జరిగిన గత మ్యాచ్ లో ( లక్నో-రాజస్థాన్ ) థ్రిల్లింగ్ గా ముగియగా.. స్పిన్నర్లు అశ్విన్, రవి బిష్ణోణ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.
Read Also : Girls things: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు ఏం చేస్తారో తెలుసా?
అయితే పిచ్ ను దృష్టిలో చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాత్మకమైన మార్పులు చేయవచ్చు.. మొయిన్ అలీ స్థానంలో మిచెల్ సాంట్నర్ ను తీసుకురావచ్చు. విన్నింగ్ జట్టును మార్చవద్దని భావిస్తే మాత్రం ఎలాంటి మార్పు లేకుండా సీఎస్కే బరిలోకి దిగనున్నారు.
Read Also : Janvi Kapoor : ఉర్ఫీని మించి చూపిస్తున్న జాన్వీ..
సీఎస్కే తుది జట్టు : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ/ మిచెల్ సాంట్నర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, మతీష పతీరణ, తుషార దేశ్ పాండే, మహీశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్.. ఇంపాక్ట్ ప్లేయర్ గా అంబటి రాయుడు.