PM Modi: కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం 10 లక్షల మంది బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వచ్చే కర్ణాటక ఎన్నికల్లో బూత్ స్ఠాయిలో ప్రచారాన్ని పటిష్టం చేయాలని, మెజారిటీతో గెలుపొందాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని. కాంగ్రెస్ పార్టీ వారంటీ గడువు ముగిసిందని, ఆ పార్టీ ఇచ్చే హామీలకు అర్థం లేదని అన్నారు. ఉచితాల వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, దేశాన్ని, ప్రభుత్వాన్ని ఇలా నడపలేమని ప్రధాని పునరుద్ఘాటించారు.
Read Also: Janvi Kapoor : ఉర్ఫీని మించి చూపిస్తున్న జాన్వీ..
మనదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు అవినీతికి, అధికారాన్ని సాధనంగా ఉపయోగించుకుంటున్నాయని, దీన్ని సాధించేందుకు సామ, ధాన, దొండోపాయాలను ప్రయోగిస్తున్నారని అన్నారు. ఇటువంటి రాజకీయపార్టీలు దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని అన్నారు. ప్రధాని శనివారం నుంచి కర్ణాటకలో రెండు రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. మొత్తం 6 బహిరంగ సభల్లో, 2 రోడ్ షోల్లో పాల్గొననున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ప్రయోజనాలను బూత్ స్ఠాయిలో ప్రజలకు కార్యకర్తలు వివరించాలని అన్నారు. కన్నడ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నించాలని సూచించారు.
ఉచిత హామీలను ప్రకటించడం ద్వారా ఇతర పార్టీలు ప్రజల్ని ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, కానీ మీ భవిష్యత్తు, మీ భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం మీ కర్తవ్యం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ అంటే అవినీతి, బంధుప్రీతికి గ్యారెంటీ అని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ నిజమైన హామీలను ఇవ్వలేని స్థితికి చేరుకుందని, కాంగ్రెస్ పార్టీ వారంటీ గడవు ముగిసిందని విమర్శించారు. అవినీతికి కాంగ్రెస్ కారణం కాబట్టే, దాన్ని అంతం చేసేందుకు ఆసక్తి చూపడం లేదని అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కేంద్ర పథకాలు అమలు కాకుండా చూస్తున్నారని, అవి అమలైతే మోదీకి మంచి పేరు వస్తుందని వారు భయపడుతున్నారని తెలిపారు.