IND vs SA 1st ODI: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. ఇప్పుడు అదే జట్టుతో 3 వన్డేల సిరీస్కు భారత్ సిద్ధం అవుతోంది. రేపు (నవంబర్ 30న) రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి వన్డే జరగనుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేరు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఎక్కువ సమయం తన స్వస్థలమైన రాంచీలో గడుపుతున్నారు. మహీ తన బైక్స్, పెంపుడు జంతువులు, ఫామ్హౌస్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమై ఐదేళ్లయినా అయినప్పటికీ అభిమానులలో ధోనీ పట్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోనీ క్రికెట్ మైదానంకు దూరమై…
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్ప్రీత్ సేన ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి మెగా ట్రోఫీని తొలిసారి ముద్దాడింది. టోర్నీలోని లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుని.. సెమీస్ చేరింది. సెమీఫైనల్లో పటిష్ట ఆస్ట్రేలియాను, ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై ప్రశంసల జల్లుతో పాటు…
Velammal Cricket Stadium: తమిళనాడులో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వేలమ్మాళ్ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు మహేందర్ సింగ్ ధోని. ముంబై నుంచి ఓ ప్రైవేట్ విమానంలో మధురై చేరుకున్న ధోనిని చూసేందుకు అభిమానులు తెల్లవారుజాము నుంచే విమానాశ్రయం వద్ద భారీగా గుమిగూడారు. వేలమ్మాళ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) సహకారంతో నిర్మించిన ఈ అంతర్జాతీయ స్థాయి స్టేడియం కోసం రూ. 300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 12.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న…
భారత క్రికెట్లో చాలా మంది ఆటగాళ్లు తమ కెప్టెన్సీలో టీమిండియాను మరో స్థాయికి తీసుకెళ్లారు. సునీల్ గవాస్కర్ మొదలు మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు తమ కెప్టెన్సీలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ టెస్ట్ మ్యాచ్లను అందించారు. కానీ అత్యధిక టెస్టుల్లో భారతదేశానికి ఏ ఆటగాడు నాయకత్వం వహించాడో మీకు తెలుసా?. టాప్ ఐదుగురు భారత కెప్టెన్ల లిస్టును ఓసారి పరిశీలిద్దాం. విరాట్ కోహ్లీ: భారత టెస్ట్ క్రికెట్లో కెప్టెన్సీ విషయానికి…
మంగళవారం ముంబైలో జరిగిన 27వ ఎడిషన్ సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల వేడుకలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇందుకు కారణం.. ఎవరూ ఊహించని రీతిలో హిట్మ్యాన్ బరువు తగ్గడమే. వన్డే ప్రపంచకప్ 2027లో ఆడడంను లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్.. ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో 95 కేజీల నుంచి 75 కిలోలకు బరువు తగ్గాడు. 20 కేజీల బరువు తగ్గిన హిట్మ్యాన్.. ఇప్పుడు యువ క్రికెటర్లకే పోటీనిచ్చేలా ఉన్నాడు.…
MS Dhoni: మాజీ టీమిండియా కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం ఎంఎస్ ధోని ముంబై ఇండియన్స్ (MI) శిక్షణ జెర్సీలో కనిపించి అభిమానులను షాక్ గురి చేశారు. వ్యాపారవేత్త అర్జున్ వైద్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలో ధోని ఒక ఫుట్బాల్ మైదానం దగ్గర కొందరితో కలిసి MI శిక్షణ జెర్సీ ధరించి పోజులిచ్చారు. ఇక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముఖ్యంగా CSK వీర అభిమానులు ఆశ్చర్యానికి…
ఐపీఎల్లో సత్తాచాటిన ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్.. భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వరుసగా మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున రాణించిన సూర్య.. 2021లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆపై రోహిత్ శర్మ సారథ్యంలో తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. ఇటీవల ఆసియా కప్ 2025లో భారత జట్టును విజేతగా నిలిపిన సూర్య.. ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. ఇక తన కోరిక…