KTR: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశం కొనసాగుతోంది. పార్టీ ప్రతినిధులు పలు తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దేశంలో గుణాత్మక మార్పు సాధించేందుకు బీఆర్‌ఎస్ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశాన్ని 75 ఏళ్ల పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. నేటికీ తాగునీరు, సాగునీరు, కరెంటు లేకపోవడంతో దేశ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మౌలిక వసతుల లేమితో దేశ ప్రగతి మందగిస్తోంది. దేశాభివృద్ధికి చోదక శక్తిగా నిలవాల్సిన యువత ఉద్యోగావకాశాలు లేకపోవడంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. నేటికీ సమాజంలో కుల, మత, లింగ వివక్ష కొనసాగడం విషాదం. ఈ వివక్షల వల్ల భారతీయ సమాజ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
దేశంలో సామాజిక సమానత్వం కొరవడిందని తెలిపారు. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. భారత రాజ్యాంగం ప్రజలందరికీ హక్కులు, రక్షణ కల్పిస్తున్నప్పటికీ దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు నాగరికత విలువలను అపహాస్యం చేస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చే ఈ వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన వనరులు ఉన్నాయని మంత్రి తెలిపారు. పాలకుల వైఫల్యం వల్ల ప్రజలు కడు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. దేశంలో నీటి వనరుల లభ్యత దేశ ప్రజల అవసరాలకు మించిదని, ఏటా దాదాపు 4 వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం కురుస్తుందని అన్నారు. నదుల్లో 70 వేల టీఎంసీల నీరు ప్రవహిస్తోంది. దేశవ్యాప్తంగా 20 వేల టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకున్నాం. మిగిలిన 50 వేల టిఎంసిల నీరు వృథాగా సముద్రంలోకి పోతుందరి కేటీఆర్ తెలిపారు. ఇందులో నుంచి మరో 20 వేల టీఎంసీల నీటిని వాడుకుంటే దేశంలోని 41 కోట్ల ఎకరాల సాగులో ఒక్కో ఎకరాకు సాగునీరు అందుతుంది. ఇవన్నీ కేంద్రం స్వయంగా వెల్లడించిన లెక్కలని మంత్రి తెలిపారు. 50 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంటే.. దేశ పాలకులు తమాషాగా చూస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడ చూసినా తాగు, సాగునీరు కటకటే అని తెలిపారు.
భారతదేశం కంటే విస్తీర్ణంలో మరియు జనాభాలో చాలా చిన్న దేశాలు పెద్ద రిజర్వాయర్లను నిర్మించాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ జింబాబ్వేలో ఉందన్నారు. పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పలువురు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణ మినహా.. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నీరు, సాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని చాలా పట్టణాలు, నగరాల్లో వారం రోజులుగా తాగునీరు దొరకడం లేదు. గ్రామాల్లో మహిళలు కిలోమీటర్ల మేర నడిచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. మంచినీళ్ల కోసం వీధి పోరాటాలకు దిగాల్సిందేనంటూ కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు.
Girls things: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు ఏం చేస్తారో తెలుసా?