Off The Record: పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడన్నట్టుగా మారిందట అక్కడ బీజేపీ కేడర్ పరిస్థితి. నమ్ముకున్న నాయకుడు నిలువునా వదిలేసి వేరే నియోజకవర్గంలో తన గెలుపును చూసుకున్నాడు. ఆయన్ని నమ్మి వచ్చిన పార్టీలో పాత-కొత్త పేరుతో విలువ ఉండటం లేదు. ఎవరూ పట్టించుకోక, ఏం చేయాలో పాలుపోక డైలమాలో ఉన్న ఆ నాయకులు ఎవరు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి?
Read Also: Husband Suicide: ప్రియుడి మోజులో భార్య.. సెల్ఫీ వీడియో రికార్డు చేసి భర్త ఆత్మహత్య..
హుజూరాబాద్.. పొలిటికల్‌గా తెలంగాణ మొత్తం మీద ప్రత్యేక గుర్తింపు ఉన్న కొద్ది నియోజకవర్గాల్లో ఒకటి. సీనియర్ లీడర్ ఈటల రాజేందర్‌కి నిన్న మొన్నటి దాకా కంచుకోట ఇది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో… గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ రెండింట్లో పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిపోయారాయన. తర్వాత వచ్చిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు ఈటల. తొలుత గజ్వేల్ కోసం.. ఆ తర్వాత మల్కాజిగిరిలో పోటీతో క్రమంగా హుజురాబాద్‌కి దూరమయ్యారాయన. దీంతో బీఆర్ఎస్ నుంచి ఈటలతో పాటు బయటకు వచ్చిన హుజూరాబాద్ క్యాడర్ కి సమస్యలు మొదలయ్యాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత అప్పుడప్పుడు ఆయన భార్య జమున వచ్చి వెళ్ళేవారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం… లోకల్‌గా బీఆరెస్ ఎమ్మెల్యే ఉండటంతో ఇక్కడ ఈటల ఫ్యామిలీకి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు పెరిగినట్టు చెబుతున్నారు.
Read Also: Off The Record: మీరు ఎమ్మెల్యేలు ఐతే సరిపోతుందా..? మా సంగతేంది..?
ఈ పరిణామాలతో గతంలో ఆయన వెంట ఉన్న నేతలు, క్యాడర్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో బీజేపీ రాష్ట్ర సారథిగా ఈటల రాజేందర్‌ని నియమించబోతున్నారనే ప్రచారం ఓ రేంజ్‌లో జరిగింది. మోడీ, అమిత్ షా కూడా డిసైడ్ అయ్యారనే టాక్ చాలా కాలం నడిచింది. దాంతో అలర్ట్ అయిన రాజేందర్ వ్యతిరేకవర్గమంతా… ఒక్కటైందట. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు… అప్పటివరకూ ఒకరంటే ఒకరికి గిట్టని వాళ్ళు కూడా ఒక్కటై జట్టు కట్టి మల్కాజ్‌గిరి ఎంపీకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారట. కారణం ఏదైనాగానీ….ఆయనకు మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదు. పార్టీ హైకమాండ్ రాజేందర్‌కు అంత సీన్ ఇవ్వడం లేదన్న ప్రచారం మొదలైంది. ఇదే ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలకు శాపమైందని అంటున్నారు.
Read Also: Crime News: ప్రియుడు కాదు.. ఆమె పాలిట యముడు..!
ఓవైపు పోలీస్ స్టేషన్స్, ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు అవకపోవడం,మరోవైపు తమ నాయకుడే తమను పట్టించుకోకపోవడంతో ఎటూ పాలుపోక… తీవ్ర నైరాశ్యంలో ఉన్నారట హుజూరాబాద్‌లోని ఈటల అనుచరులు. అదే సమయంలో సొంత పార్టీలో సైతం గుర్తింపు దక్కకపోవడం వాళ్ళని తీవ్ర నిరాశలోకి నెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక బీజేపీ కార్యక్రమాల కోసం వాళ్ళకు కనీసం పిలుపు కూడా అందడం లేదని తెలిసింది. ఈ పరిస్థితుల్లో… కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని ఈటల అనుచరగణం రహస్యంగా భేటీ అయిందట. హుజూరాబాద్‌లో కేంద్రమంత్రి పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసే సమయంలోనే.. ఎంపీ అనుచరులు రహస్య భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమకు బీజేపీలో ప్రాధాన్యత దక్కకపోవడం, ఏ సమావేశాలకు పిలవకపోవడంపై ఆ మీటింగ్‌లో చర్చించుకుని అదే విషయాన్ని రాజేందర్ దృష్టికి తీసుకువచ్చినట్టు సమాచారం.
Read Also: Cyber Crime: సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్న టీజీ పోలీసులు.. రాష్ట్రం దాటినా వదలట్లే…
దాంతో.. ఇది సమయం కాదు మిత్రమా.. కాస్త వేచి చూద్దాం అనే ధోరణిలో సర్దిచెప్పే ప్రయత్నం చేశారట ఆయన. కానీ… బీజేపీ ఏ ప్రోగ్రామ్ నిర్వహించినా… జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుల హవానే నడుస్తోందని… పాత బీజేపీ వారికి ఇచ్చిన ప్రయార్టీ తమకు ఇవ్వడం లేదని రాజేందర్ మునుషులు నారాజ్ అవుతున్నట్టు సమాచారం. ఆయన మాత్రం డోంట్‌వర్రీ అని సర్ది చెబుతున్నారట. మనకి మంచిరోజులు వస్తాయి, కేంద్రంలో పదవి దక్కబోతోందని సన్నిహితులకు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. అయినా వాళ్ళలో మాత్రం నమ్మకం కలగలేదని అంటున్నారు. వస్తే రెగ్యులర్‌గా హుజూరాబాద్ కి రావాలని, లేదంటే తమ దారి తాము చూసుకుంటామని నిర్మొహమాటంగా చెప్పాలనుకుంటున్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హుజురాబాద్ క్యాడర్ తీరు ఆసక్తికరంగా మారింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇలా చేయడం వెనుక వారి వ్యూహం ఏంటనేది లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది… మూకుమ్మడిగా పార్టీ మారతారా..? లేదంటే లోకల్ బాడీస్‌లో ఈటల సహకారం కోసం ఈ స్టెప్ తీసుకున్నారా అనేది కొద్ది రోజుల్లో తేలే అవకాశాలు ఉన్నాయంటున్నారు పొలిటికల్ పండిట్స్.