సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్‌కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్‌లో ఉంటున్న ఓ వృద్దురాలికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తులు సీబీఐ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆమెపై కేసు నమోదైందని బెదిరించాడు. అక్రమ ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని భయపెట్టాడు. సీబీఐ తోపాటు ఈడీలోనూ కేసు నమోదైందని మరో వ్యక్తి బెదిరించాడు. తాము చెప్పినట్లు వినకపోతే డిజిటల్ అరెస్ట్ చేస్తామన్నారు. ఫలితంగా వాళ్లు చెప్పిన విధంగా చేసింది ఆ వృద్ధురాలు. సైబర్ నేరగాళ్లకు తన అకౌంట్లో సొమ్మంతా ట్రాన్స్‌ఫర్ చేసింది. అప్పు తెచ్చి మరీ డబ్బు చెల్లించింది. కానీ ఇంకా ఇంకా కావాలని ఆమెను వేధించారు. ప్రతిరోజు నిత్య నరకాన్ని అనుభవించిన వృద్ధురాలు.. చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది..
READ MORE: Poolachokka Naveen: నెగిటివ్ రివ్యూ కేసు.. పోలీసుల అదుపులో యూట్యూబర్ పూలచొక్క నవీన్..
ఈ కేసులో కింగ్ పిన్ ముంబైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోని గోయల్ అనే వ్యక్తి దీనికి సూత్రధారిగా తేల్చారు. దీంతో ముంబై కేంద్రంగా నడుస్తున్న సైబర్ నేరగాళ్ల భరతం పట్టారు. వాళ్ళలో కొందరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ తెలంగాణలో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా వాళ్లకు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. హైదరాబాదులోని ఆరుగురు వ్యక్తులు సైబర్ నెరగాళ్ళకు సహకారం అందించారని బయటపడింది. ఇందులో సుధాకర్‌తో పాటు పేర్ని డాన్సర్ రాజ్ కూడా వాళ్లకు సహాయం అందించాడని పోలీసులు చెప్పారు. సైబర్ నేరగాళ్లకు వీళ్ళు బ్యాంకు అకౌంట్లను ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాంకు అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత సైబర్ నేరగాళ్లు వాటిని డ్రా చేసుకున్నారు.. సైబర్ నేరగాళ్లకు సహాయం చేసిన వాళ్ళపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఒకరిద్దరూ దుబాయ్‌లో ఉండి సైబర్ నేరాలకు సహాయం అందించారు. హైదరాబాదులో ఉన్న విజయ్ కుమార్ అనే వ్యక్తి కూడా సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్లను ఇచ్చారు. పోలీసులు అరెస్టు చేస్తారని భయపడి ఏకంగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్పటికే లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు పోలీసులు. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన విజయకుమార్‌ని ముంబై ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పేర్ని డాన్సర్‌తో సహా ఆరుగురు పైనా కేసులు నమోదు చేశారు.
READ MORE: Mahesh Kumar Goud: రాయలసీమను రతనాల సీఎం చేస్తా అన్నది కేసీఆర్ కాదా..?