Off The Record: సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమం అక్కడి ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తోందా? సమాధానం చెప్పలేక స్వయంగా ఎమ్మెల్యేలే జారుకుంటున్నారా? ఇదెక్కడి గొడవరా బాబూ అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారా? మీరు ఎమ్మెల్యేలు అయితే సరిపోతుందా… మా సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నదెవరు? టీడీపీ ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి?
Read Also: Crime News: ప్రియుడు కాదు.. ఆమె పాలిట యముడు..!
అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమం నిర్వహిస్తోంది టీడీపీ. నెల రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించాలన్నది ప్రోగ్రామ్ లక్ష్యం. ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ధిదారులకు ఏ విధంగా అందుతున్నాయి.. ఆ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి? అన్న విషయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నది దీని ఉద్దేశ్యం. మిగతా చోట్ల ఆ వ్యవహారం ఎలా ఉన్నా….కాకినాడ జిల్లాలో మాత్రం కాస్త తేడాగా జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలు, రెండుచోట్ల జనసేన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలా… ఐదుగురు ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఇన్ఛార్జ్‌లు టీడీపీ తరపున ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా… క్షేత్ర స్థాయికి వెళ్ళేసరికి వాళ్ళకు రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయట. అదీకూడా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు నుంచి కావడంతో… ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్‌లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది.
Read Also: Off The Record: ఉత్తరాంధ్ర నేతలు ఫెయిల్ అవుతున్నారని సీఎం కోపంగా ఉన్నారా?
తమను కనీస మాత్రంగా కూడా పట్టించుకోవడం లేదని తెగ ఫీల్ అయిపోతున్నారట సదరు నాయకులు. కొన్నిచోట్ల అయితే ఎమ్మెల్యేలను డైరెక్ట్‌గానే నిలదీస్తున్నట్టు చెబుతున్నారు. మీకేం…. మీ పాటికి మీరు.. మీరు సెటిలైపోయారు. మమ్మల్ని మాత్రం వదిలేశారంటూ డైరెక్ట్ అటాక్ చేసేస్తున్నారట. మాతో పని అయిపోగానే…ఇలా గాలికి వదిలేస్తారా? మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత చూసుకోవచ్చని అనుకుంటున్నారా అంటూ… కడిగి పారేస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవులు, పథకాల విషయంలో పెద్దగా ప్రాధాన్యత లేదని ఫీల్ అవుతున్నారట చాలామంది తమ్ముళ్ళు. ప్రభుత్వం తరఫున బీసీ, ఎస్సీ లోన్లు ప్రకటించింది…. అందుకోసం దరఖాస్తులు కూడా స్వీకరించారు.. అయితే ఉన్న యూనిట్లకు పదింతలు అప్లికేషన్లు రావడంతో తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టారు అధికారులు. దానిపై కూడా గుర్రుగా ఉన్నారట టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు. సాధారణ ఓటర్లకు ఏ విధంగా లబ్ది చేకూరుతోందో… తమకు అవే వస్తున్నాయి తప్ప కొత్తగా.. మీరు పొడిచిందేంటి… మాకు చేసిందేటని గట్టిగా నిలదీస్తున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టుల్లో కూడా తమను పరిగణలోకి తీసుకోవడం లేదని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారట.
పార్టీ కోసం, ఎమ్మెల్యే కోసం ఎంతో చేశాం… అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆ ఊసే ఎత్తడం లేదంటూ బరస్ట్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. కలవడానికి వస్తే… కనీసం టైం ఇవ్వడం లేదంటూ… ఇప్పుుడు తమ గుమ్మం దగ్గరికి వచ్చిన వాళ్ళని నిలదీస్తున్నారట. దీంతో ఈ వ్యవహారం ఎమ్మెల్యేలకు తల నొప్పిగా మారిందన్న వాదన బలపడుతోంది. ఈ నిలదీతల దెబ్బకు కార్యక్రమాన్ని మొదలుపెట్టి….ఇక మీరు చూస్కోండని లోకల్ లీడర్స్‌కు అప్పగించేసి… ఎమ్మెల్యేలు పక్కకు తప్పుకుంటున్నట్టు సమాచారం. ఇది గమనిస్తున్న నాయకులు ఏ మాత్రం తగ్గడం లేదట. ఎలక్షన్ టైంలో మేం కావాలి…. ఏదన్నా పని అడిగితే మాత్రం చల్లగా జారుకుంటారా… మాకూ మళ్ళీ టైం వస్తుందంటూ స్మూత్ గా వార్నింగ్ ఇస్తున్నారట. పదవులు పందేరంలో కూడా… పార్టీ కోసం డెడికేటెడ్‌గా పని చేసిన వాళ్ళని కాదని.. వెయిట్ ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో జనసేనకి ఉన్న ప్రాధాన్యత కూడా తమకు లేదని సైకిల్ పార్టీ నియోజకవర్గ స్థాయి లీడర్లు తెగ డిస్కషన్ చేసేస్తున్నారట.
Read Also: Poolachokka Naveen: నెగిటివ్ రివ్యూ కేసు.. పోలీసుల అదుపులో యూట్యూబర్ పూలచొక్క నవీన్..
వాళ్లు ఎమ్మెల్యేలు అయిపోయారు ఇక మనల్ని ఎందుకు పట్టించుకుంటారంటూ… సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టేస్తున్నారు. పనుల విషయంలో కూడా ఆ కొందరికే టిక్ పెడుతున్నారంటూ క్లారిటీగా చెప్పాల్సింది చెప్పేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు ఓడ మల్లన్న, తీరాక బోడి మల్లన్న అంటే…. ఆ రాజకీయాలు ఎక్కువ రోజులు సాగవని ఎమ్మెల్యేలకు గుర్తు చేస్తున్నారట నియోజకవర్గ నేతలు. మనకి స్పెషల్ బెనిఫిట్స్ లేకుండా రాజకీయాలు చేయడం అనవసరం అని టీడీపీ లీడర్స్ వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లను తమ్ముళ్ళు ఏకి పడేస్తున్నారు. దాంతో అటు ఇటు తిరిగి ఎక్కడ తేడా కొడుతుందోననుకుంటూ… ఎమ్మెల్యేలు గాయబ్ అవుతున్నట్టు సమాచారం.