Kerala Chief Minister on Triple Talaq: ముస్లింలు ఆచరించే త్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇటీవలే చట్టం చేసింది. వివాదాస్పద త్రిపుల్ తలాక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గతంలో వివాదాస్పదమైంది. ఇప్పుడు మరోసారి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అన్ని మతాలలో విడాకులు జరిగినప్పుడు ముస్లింలలో తక్షణ విడాకుల పద్ధతిని ఎందుకు నేరంగా పరిగణిస్తారని ఆయన ప్రశ్నించారు.
విడాకులనేవి అన్ని మతాల్లో జరుగుతున్నప్పటికీ.. కేవలం ముస్లింలలో త్రిపుల్ తలాక్ మాత్రమే ఎందుకు నేరంగా పరిగణించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశ్నించారు. ఇతర మతాల్లో విడాకుల కేసును సివిల్ కేసుగా చూస్తున్నప్పుడు..ఇస్లాంలోని త్రిపుల్ తలాక్ క్రిమినల్ కేసు ఎలా అవుతుందన్నారు. కేరళలో సీఏఏ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమలు చేయమని ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు. ఒక్కో మతానికి ఒక్కో రకమైన శిక్షను విధించవచ్చా అని ప్రశ్నించారు. ఓ మతాన్ని అనుసరించేవారికి ఒక చట్టం, మరో మతాన్ని అనుసరించేవారికి ఇంకో చట్టం ఉండవచ్చా అని నిలదీశారు. కేరళలోని కాసరగోడ్‌లో అధికార సీపీఎం మార్చ్ ‘జనకీయ ప్రతిరోధ జాధా’ను ప్రారంభిస్తూ కేరళ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి మైనారిటీ హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలకు పౌరసత్వం మంజూరు చేయడానికి కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) చట్టాన్ని కేరళలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు.
Javed Akhtar: పాక్‌లో జావెద్.. దాయాది దేశంలోనే 26/11 ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు
దేశంలో అందరూ భారతీయులేనని, ఫలానా మతంలో పుట్టినందుకే పౌరసత్వం వస్తుందని ఎలా చెప్పగలమన్నారు. పౌరసత్వానికి మతం ప్రాతిపదిక ఎలా అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చేందుకు మతాన్ని ఉపయోగిస్తుందన్నారు. రాష్ట్రంలో మాత్రం అమలు చేయబోమని తెలిపారు. మ్యాట్రిమోనియల్ విడాకుల విషయంలో ఒక దేశం ప్రత్యేక శిక్షా ప్రమాణాలను కలిగి ఉండగలదా అని ఆయన ప్రశ్నించారు. ముస్లింలలో తలాక్..తలాక్..తలాక్ అని మూడు సార్లు ఉచ్ఛరించడం ద్వారా భార్యలకు విడాకులిచ్చే పద్ధతి గతంలో ఉండేది. ఇది రాజ్యాంగ విరుద్ధమని 2017లో సుప్రీంకోర్టు తెలిపింది. ఆ మరుసటి ఏడాది ముస్లిం మహిళల ఆర్జినెన్స్ 2018ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించగా, రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అప్పట్నించి దేశంలో త్రిపుల్ తలాక్ అనేది నాన్ బెయిలబుల్ నేరంగా మారడం గమనార్హం.