కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. తంపానూర్ పోలీస్ స్టేషన్‌కు ఈమెయిల్ ద్వారా బెదిరింపు సందేశం అందింది.
మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ (79) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతిచెందారు.ఆరు దశాబ్దాలకు పైగా విశిష్టమైన కెరీర్‌ను కొనసాగించింది. కొన్ని నెలలుగా వయోభారంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. పొన్నమ్మ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన ప్రకటనపై కేరళలో రాజకీయ వివాదం నెలకొంది. కర్ణాటకలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేరళలో అధికార ఎల్‌డీఎఫ్ మిత్రపక్షమైన జేడీఎస్‌కు ఆమోదం తెలిపినట్లు జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ చేసిన వాదనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం (అక్టోబర్ 20) తోసిపుచ్చారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు దేశానికి సానుకూల భవిష్యత్తును తెలియజేస్తున్నాయని, ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ తదితర పరిశ్రమలో ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖ నటులు కన్నుమూశారు. తాజాగా ప్రముఖ మలయాళ సినీ నటుడు, లోక్‌సభ మాజీ ఎంపీ ఇన్నోసెంట్ మరణించారు.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై రాజకీయ కారణాలతో ఆప్ నేతను టార్గెట్ చేశారన్న అభిప్రాయాన్ని తొలగించాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ముస్లింలు ఆచరించే త్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇటీవలే చట్టం చేసింది. వివాదాస్పద త్రిపుల్ తలాక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గతంలో వివాదాస్పదమైంది.