Javed Akhtar: పాక్‌లో జావెద్.. దాయాది దేశంలోనే 26/11 ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Javed Akhtar: ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ పాకిస్తాన్‌ను ఆ దేశంలోనే విమర్శించారు. 26/11 ఉగ్రపేలుళ్ల ఘటన గురించి గుర్తు చేస్తూ.. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్‌లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. 26/11 ఉగ్రవాదులు దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. భారతీయుల హృదయాలలో చేదు గురించి పాకిస్తాన్‌లో చేసిన ముక్కుసూటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పురాణ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం లాహోర్‌లో జరిగిన ఉత్సవం కోసం జావేద్ అక్తర్ గత వారం పాకిస్థాన్‌ను సందర్శించారు.
ప్రఖ్యాత గీత రచయిత, ఒక పరస్పర చర్చ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడం గురించి మాట్లాడారు. భారత్-పాక్ సంబంధాలు, ముంబయి ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావించారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని.. పైగా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని జావెద్ అక్తర్ అన్నారు. వాటిని తగ్గించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. తాము ముంబయికి చెందిన వాళ్లమని అన్న జావెద్.. ముంబయిసో ఉగ్రవాదులు ఎలాంటి బీభత్సాన్ని సృష్టించారో కళ్లారా చూశామన్నారు. ఉగ్రవాదులు నార్వే లేదు ఈజిప్టు నుంచి వచ్చిన వారు కాదని.. పాకిస్తాన్‌లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. అలాంటప్పుడు భారత్ దాని గురించి ఫిర్యాదులు చేసినప్పుడు మీరు దాన్ని ప్రతికూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదని జావెద్ అక్తర్ వ్యాఖ్యానించారు.
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
Read Also: UPSC Civil Services Exam: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు అప్లై చేశారా.. గంటలే గడువు!
భారత ఆర్టిస్టులను పాక్‌లో గౌరవించకపోవడాన్ని జావెద్ అక్తర్ తప్పుబట్టారు. నుశ్రత్ ఫతే అలీ ఖాన్, మెహదీ హసన్ లాంటి పాక్ కళాకారుల గౌరవార్థం మేం పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నామన్న ఆయన… కానీ లతా మంగేష్కర్ కోసం పాక్ ఎప్పుడైనా ఫంక్షన్ ఏర్పాటు చేసిందా అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 2008 నవంబరు 26న పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ముష్కరులు ముంబయిలోకి చొరబడి నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే ఈ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో 9 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు. మరో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకోగా.. నాలుగేళ్ల తర్వాత 2012లో అతడిని ఉరితీశారు.
పాకిస్థాన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలకు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌లో జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలకు హర్షం వ్యక్తం చేసిన వారిలో నటి కంగనా రనౌత్ కూడా ఉన్నారు. జావెద్ అక్తర్ కవిత్వం వింటున్నప్పుడు తాను ఆశ్చర్యపోయినట్లు కంగనా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
So….. #javedakhtar sahab went to #Lahore for #FaizFestival2023 and said this! 👏🏻 👏🏻 👏🏻 👏🏻 👏🏻@Javedakhtarjadu sahab 🙏🏼 pic.twitter.com/X6x2Pcp3ef
— SATYA (@satyanas) February 20, 2023
Jab main Javed saab ki poetry sunti hoon toh lagta tha yeh kaise Maa Swarsati ji ki in pe itni kripa hai, lekin dekho kuch toh sachchai hoti hai insaan mein tabhi toh khudai hoti hai unke saath mein … Jai Hind @Javedakhtarjadu saab… 🇮🇳
Ghar mein ghuss ke maara .. ha ha 🇮🇳🇮🇳 https://t.co/1di4xtt6QF— Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!