CPI Narayana: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా తెలివి తేటలు ఉన్న ఇమ్మడి రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థ లే.. ఐ బొమ్మలో సినిమాలను ఫ్రీగా నేను కూడా చూశానని తెలిపారు.
మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు మారేడుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్, అంతకుముందు మావోయిస్టులపై జరిగిన ఎన్‌కౌంటర్స్ మొత్తం ఫేక్ అని కూనంనేని అన్నారు. Also Read: MS Dhoni…
ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. గుంటూరు ఏసీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నిర్వహించి సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాలు ప్రైవేటీకరణ అవుతున్నాయన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు పడతాయి... కానీ, ఒక్క ఏపీలోనే ఎన్డీఏ అభ్యర్థికి వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పి ఆయన.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని కించపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారు..
D Raja: ప్రకాశం జిల్లాలో ప్రకటించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అనేక విషయాలపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటని అన్నారు. ప్రజా సమస్యలపై సుధాకర్ రెడ్డి జీవితాంతం పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి జగదీష్ ధన్కర్ ఎందుకు రాజీనామా చేశారో ఎవరికీ తెలియదంటూనే.. ఆయన రాజీనామా వెనుక రాజకీయ వత్తిడిలు ఉన్నాయన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో జస్టిస్ సుదర్శన్…
Bhatti Vikramarka Pays Tribute to Suravaram Sudhakar Reddy: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళి అర్పించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌కు వెళ్లిన భట్టి.. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలను డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు. మనం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయాం అని అన్నారు. చిన్న…
CM Revanth Reddy Pays Tribute to Suravaram Sudhakar Reddy: పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజీపడని జీవితం, రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత అని గుర్తు చేసుకున్నారు. బహుజనుల సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా మలుచుకున్న వారికి ఇది తీరని లోటు అన్నారు. తమ జిల్లాకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుడు అని చెప్పారు. గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణకు…
భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్సభ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బండారు దత్తాత్రయ తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. సురవరం భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సీపీఐ రాష్ట్ర కార్యసంఘంలో మరోసారి కూనంనేని ఎన్నిక జరగడం మైదానంలో కలకలం రేపింది. కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు రెండో సారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, ఇ.టి. నర్సింహా ను ఎంచుకున్నారు.
CPI Narayana: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కటాక్షం లేకుంటే జగన్ ఇన్ని రోజులు కోర్టుకు వెళ్లకుండా బయట ఉండటం సాధ్యం కాదన్నారు.