నేడు IIM – వైజాగ్ క్యాంపస్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం జగన్.. వర్చువల్ విధానంలో పాల్గొనున్న ప్రధాని.. గంభీరం దగ్గర 436 ఎకరాల్లో నిర్మించిన IIM శాశ్వత క్యాంపస్.. 2016 నుంచి ఆంధ్రా యూనివర్సిటీలో తాత్కాలిక క్యాంపస్ లో కొనసాగుతున్న IIM – వైజాగ్..
నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా.. వధువు తల్లుల ఖాతాల్లో రూ. 78.53 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్.. 2023 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న.. అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా నిధుల విడుదల..
నేడు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు.. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం..
నేడు ఆర్కే బీచ్ లో మిలన్ 2024 ఫుల్ డ్రెస్ రిహార్సల్స్.. యుద్ధ విమానాలు, నౌకల విన్యాసాలు, సిటి పరేడ్.. పాల్గోనున్న 57 దేశాల నేవీ బృందాలు.. ఈనెల 22న భారత ఉపరాష్ట్రపతి, గవర్నర్ రాక.. విస్తృతమైన ఏర్పాట్లు చేసిన పోలీసు, జిల్లా యంత్రాంగం.. 3, 536 మందితో బందోబస్తు.. ఆర్కే బీచ్ మార్గంలో రాకపోకలపై ఆంక్షలు.
నేడు రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటన.. ఉదయం 10 గంటల నుంచి రాజమండ్రి ఏవీ ఏ రోడ్ లో ఉన్న జనసేన పార్లమెంటు కార్యాలయంలో పవన్ సమావేశాలు.. ఎన్నికల్లో జనసేన టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ముఖ్య నేతలతో పవన్ సమీక్ష.
నేడు తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.. మధ్యాహ్నం: 12:00 గంటలకు ధవళేశ్వరం గ్రామంలో పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొంటారు..
నేడు పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన.. పెనుగొండ క్షేత్రం వాసవి శాంతిధామ్ లో ఆత్మార్పణ, పంచమ వార్షికోత్సవ మహోత్సవాల్లో పాల్గొనున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. అనంతరం పీఎం లంకలోని డిజిటల్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని పరిశీలించనున్న కేంద్రమంత్రి..
నేటి నుండి 23వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భువనేశ్వరి పర్యటన.. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జిడి నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో పర్యటించనున్న భువనేశ్వరి..
నేడు విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన.. 14వ వార్డులో పాఠశాల భవనాలను ప్రారంభిస్తారు.. ఏపీ టిడ్కో ఇళ్లను ప్రారంభిస్తారు.. ఎస్బీఐ కూడలి వద్ద మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు..
నేడు విజయవాడలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జేఏసీ అధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా.. పెండింగ్ ఐఆర్, టీఏ, డీఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా..
నేడు ఏపీ సర్పంచుల అసోసియేషన్ రాష్ట్ర సదస్సు.. పంచాయితీల నిధుల మళ్లింపు అంశంపై చర్చ
నేడు బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తుపై స్టేట్ లెవెల్ సెమినార్.. హాజరు కానున్న సీపీఐ నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సీపీఐ రామకృష్ణ, గిడుగు రుద్రరాజు, సీపీఎం శ్రీనివాస్ రావు.
నేడు తిరుమలో శ్రీవారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. సర్వదర్శనానికి 10 గంటల సమయం..
నేడు శ్రీశైలం ఆలయంలో 5వ రోజు మహాకుంభాభిషేకం.. ఉదయం గోపూజ, జపాలు, గణపతి, రుద్ర, చండీ , వేద పారాయణం, హోమాలు.. సాయంత్రం శయ్యాధివాసం, వేదస్వస్తి, నీరాజనం, మంత్రపుష్పం.. శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు రేపు ఆలయంలో మహాకుంభాభిషేకం.